Realme C53: ప్రీమియం ఫోన్ డిజైన్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
Realme C53 స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలయ్యింది
ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మి ప్రీమియం ఫోన్ డిజైన్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది
ఐఫోన్ 13 వంటి కెమేరా మాదిరిగా కనిపించే డిజైన్ తో ఈ ఫోన్ వచ్చింది
Realme C53 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మి ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మి ప్రీమియం ఫోన్ డిజైన్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ఐఫోన్ 13 వంటి కెమేరా మాదిరిగా కనిపించే డిజైన్ తో ఈ ఫోన్ వచ్చింది మరియు ఐఫోన్ 14 లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ వంటి 'Mini Capsule' ఫీచర్ తో కూడా వచ్చింది. ఈరోజే ఇండియాలో విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు వివరంగా తెలుసుకుందామా.
Realme C53: ధర
Realme C53 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 9,999 ధరలో వచ్చింది. రెండవ వేరియంట్ 6GB+ 64GB స్టోరేజ్ తో 10,999 ధరతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన లాంచ్ అఫర్ లను కూడా రియల్ మి ప్రకటించింది.
Realme C53 స్మార్ట్ ఫోన్ Early Bird సేల్ ఈరోజు సాయంత్రం 6PM నుండి 8PM జరుగుతుంది.
Realme C53: ప్రత్యేకతలు
Realme C53 స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ డిస్ప్లేని HD రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. అంటే, ఈ ఫోన్ లో HD రిజల్యూషన్ వీడియోలను 90Hz రిఫ్రెష్ రేట్ తో మీరు ఆస్వాదించవచ్చు. రియల్ మి సి53 ఫోన్ కేవలం 7.9mm మందంతో చాలా సన్నని డిజైన్ తో వచ్చింది.
C53 స్మార్ట్ ఫోన్ Unisoc T612 ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ మరియు 6GB వరకూ డైనమిక్ ర్యామ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ప్రోసెసర్ తో హెవీ గేమింగ్ అవకాశం ఉండదు. కానీ, నార్మల్ గేమింగ్, మల్టీ టాస్కింగ్, OTT పైన కంటెంట్ ను అందించవచ్చు. ఈ ఫోన్ ఛాంపియన్ గోల్డ్ మరియు ఛాంపియన్ బ్లాక్ రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
రియల్ మి సి53 వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 108MP (S5KHM6SX3) ప్రైమరీ కెమేరా మరియు 2MP పోర్ట్రైట్ కెమేరా ఉన్నాయి. 53 ఫోన్ మెయిన్ కెమేరా 1080p రిజల్యూషన్ వీడియోలను 30 fps వద్ద షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో పెద్ద కెమేరా ఉన్న ప్రోసెసర్ కారణంగా 4K రిజల్యూషన్ వీడియోలను పొందలేరు. అయితే, ఈ ఫోన్ తో మంచి క్లారిటీతో ఫోటోలను షూట్ చేయవచ్చు మరియు చాలా కెమేరా మోడ్స్ మరియు ఫిల్టర్స్ ను కూడా ఈ ఫోన్ లో అందుకుంటారు.
ఈ సి53 ఫోన్ లో ఫ్రెంట్ 8MP సెల్ఫీ కెమేరా వుంది. Realme C53 స్మార్ట్ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి అందించింది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3-Card స్లాట్ ప్రయోజనాలను కూడా రియల్ మి జత చేసింది.
సింపుల్ గా చెప్పాలంటే, 10 వేల బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ప్రీమియం లుక్, రెగ్యులర్ రియల్ మి C సిరీస్ ఫీచర్స్ మరియు 108 భారీ కెమేరా వంటి ప్రధాన ఆకర్షణలతో పాటుగా బిగ్ బ్యాటరీ తో ఈ ఫోన్ ను రియల్ మీ అందించింది.