Realme C51 Launched: ప్రీమియం లుక్, ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP AI Camera తో లాంచ్.!
రియల్ మి ఈరోజు ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేటగిరిలో Realme C51 ను లాంచ్ చేసింది
ప్రీమియం లుక్, ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP AI Camera తో లాంచ్ చేసింది
4GB RAM + 4GB వరకూ డైనమిక్ ర్యామ్ మరియు 64GB + 64GB బూస్టెడ్ స్టోరేజ్ తో లాంచ్
రియల్ మి ఈరోజు ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేటగిరిలో Realme C51 ను లాంచ్ చేసింది. ఈ Realme C51 స్మార్ట్ ఫోన్ ను రూ. 10,000 రూపాయల ఉప బడ్జెట్ కేటగిరిలో ప్రీమియం లుక్, ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP AI Camera తో లాంచ్ చేసింది. రియల్ మి లేటెస్ట్ గా భారత్ మార్కెట్ లో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ విలక్షణమైన కలర్ అప్షన్ లలో అందించ బడింది. Realme C51 స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.
Realme C51 Price
రియల్ మి సి51 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ.8,999 రుపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ వేరియంట్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క Early Bird sale ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి నుండి మొదలవుతుంది. అయితే, ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ సెప్టెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుండి సేల్ అవుతుంది.
Realme C51 specs
రియల్ మి సి51 స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ డిస్ప్లేలో రియల్ మి కొత్తగా ప్రవేశపెట్టిన Mini Capsule ఫీచర్ ని జత చేసింది. C51 స్మార్ట్ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ ను కలిగి వుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 4GB RAM + 4GB వరకూ డైనమిక్ ర్యామ్ మరియు 64GB + 64GB బూస్టెడ్ స్టోరేజ్ తో ఈ ఫోన్ ఉంటుందని కంపెనీ నొక్కి చెబుతోంది.
C51 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో 50MP AI Camera తో లాంచ్ అయ్యింది. ఇందులో 50MP AI Camera మెయిన్ కెమేరాకి జతగా మరొక కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ ను కంపెనీ ఈ ధరలో మరింత వేగంగా ఛార్జ్ చెయ్యగల ఛార్జర్ మరియు ఛార్జ్ టెక్ తో అందించింది. Realme C51 స్మార్ట్ ఫోన్ ను 5,000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W SuperVOOC ఛార్జ్ టెక్ తో అందించింది మరియు ఈ టెక్ తో ఈ ఫోన్ కేవలం 28 నిముషాల్లో 50% ఛార్జ్ చెయ్యగలదని కూడా కంపెనీ తెలిపింది.
C51 లో సెక్యూరిటీ పరంగా సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వుంది మరియు ఈ ఫోన్ చాలా సన్నగా వుంది. Realme C51 స్మార్ట్ ఫోన్ కార్బన్ బ్లాక్ మరియు మింట్ గ్రీన్ అనే రెండు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
image Source: Realme c51 official unboxing video