రేపే రియల్ మీ సి33 మొదటి సేల్.. ఇవే ఫీచర్లు.!

Updated on 11-Sep-2022
HIGHLIGHTS

రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme C33 యొక్క మొదటి సేల్ రేపు జరగనున్నది

ఈ ఫోన్ బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు బడ్జెట్ బెస్ట్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగివుంది

ఈ ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సి మరియు శాండీ గోల్డ్ అనే మూడు కలర్ అప్షన్లలో లభిస్తుంది

రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme C33 యొక్క మొదటి సేల్ రేపు జరగనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో సరికొత్త మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో భారత మార్కెట్లో ప్రవేశపట్టినట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు బడ్జెట్ బెస్ట్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగివుంది. రేపు మొదటిసారిగా సేల్ కి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను తెలుసుకోండి.   

Realme C33: ధర

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ ను 3GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ తో రూ.8,999 ధరతో ప్రకటించింది. అలాగే, 4GB ర్యామ్ మరియు 64 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఈ ఫోన్ సెప్టెంబర్ 12 న మొదటిసారిగా సేల్ కి అంధుబాటులో ఉంటుంది.

Realme C33: స్పెక్స్

రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ స్క్రీన్ ని 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సి మరియు శాండీ గోల్డ్ అనే మూడు కలర్ అప్షన్లలో లభిస్తుంది.

కెమెరాల పరంగా, రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 50MP+0.3MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :