Realme GT 6T 5G ఫోన్ పై రూ. 7000 డిస్కౌంట్ చేసిన రియల్ మీ.. ఎప్పటి వరకు అంటే.!

Updated on 15-Jan-2025
HIGHLIGHTS

Realme GT 6T 5G స్మార్ట్ ఫోన్ పై రూ. 7,000 భారీ డిస్కౌంట్

ఈ భారీ డిస్కౌంట్ తో ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ రేటుకు లభిస్తోంది

Republic Day Sale నుంచి రియల్ ఈ ఆఫర్ అందించింది

Realme GT 6T 5G స్మార్ట్ ఫోన్ పై Republic Day Sale నుంచి రియల్ మీ రూ. 7,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ని కంపెనీ అందించింది. ఈ భారీ డిస్కౌంట్ తో ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ రేటుకు లభిస్తోంది. ఈ ఫోన్ పవర్ ఫుల్ చిప్ సెట్, గొప్ప కెమెరా మరియు మరిన్ని ఫీచర్స్ తో ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు రియల్ మీ ఆఫర్ తో ఎన్నడూ లేనంత చవక ధరకు లభిస్తోంది.

Realme GT 6T 5G : ఆఫర్

రియల్ మీ GT స్మార్ట్ ఫోన్ యొక్క 8GB + 128GB ఇండియన్ మార్కెట్లో రూ. 30,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఈ వేరియంట్ ఈరోజు అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి రూ. 7,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయల ధరకు లిస్ట్ అయ్యింది.

పైన తెలిపిన డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ ఫోన్ పై మరో రెండు ఆఫర్లు కూడా అందించింది. ఈ ఫోన్ ను MobiKwik వాలెట్ తో MBK1500 కూపన్ కోడ్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పై No Cost EMI ఆఫర్ ను కూడా రియల్ మీ అందించింది.

అయితే, ఈ ఫోన్ పై ఈ ఆఫర్ ను లిమిటెడ్ పిరియడ్ టైం కోసం మాత్రమే అందించింది. ఈ ఫోన్ పై అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ జనవరి 20వ తేదీతో ముగుస్తుంది.

Also Read: Earbuds Deals: లేటెస్ట్ సేల్ నుంచి రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్ డీల్స్.!

Realme GT 6T 5G : ఫీచర్స్

రియల్ మీ GT 6T 5జి స్మార్ట్ ఫోన్ 1.5M AnTuTu స్కోర్ అందించే Snapdragon 7+ Gen 3 చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6000 నిట్స్ అల్ట్రా బ్రైట్నెస్ అందించే 8T LTPO స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP (Sony LYT-600) మెయిన్, Sony IMX355 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 32MP (Sony IMX615) సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K@60fps/30fps వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు AI సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5500mAh బిగ్ బ్యాటరీ మరియు 120W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :