Realme C61: రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఇండియన్ మార్కెట్ లో రియల్‌మీ సి 61 స్మార్ట్ ఫోన్ ను ఈ నెల చివరిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను స్టీల్ వంటి పటిష్టమైన ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో తీసుకొస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర ఫీచర్ లను వివరిస్తూ రియల్‌మీ ఇప్పుడు ఆటపట్టిస్తోంది.
రియల్‌మీ సి 61 స్మార్ట్ ఫోన్ ను జూన్ 28 వ తేదీ ఇండియాలో విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. అందుకే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ ద్వారా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ లను కూడా వెల్లడించింది.
రియల్‌మీ సి 61 స్మార్ట్ ఫోన్ ను స్టీల్ వంటి పటిష్టమైన ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. C61 ఫోన్ లో ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ ఫ్రెమ్ ఉన్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది. ఈ ఫోన్ చాలా సన్నగా గ్రీన్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గట్టి గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుందని తెలిపింది.
ఈ ఫోన్ గట్టి దానాన్ని తెలిపేలా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లను కూడా రియల్‌మీ అందించింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క కొన్ని వివరాలను మాత్రమే రియల్‌మీ బయట పెట్టింది. కానీ ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరాతో సింగిల్ LED ఫ్లాష్ లైట్ వుంది. ఈ కెమెరా సెటప్ ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న సెపరేట్ రింగ్ డిజైన్ తో వుంది.
Also Read: Redmi Note 13 Pro: భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కొత్త వేరియంట్ లాంచ్.!
2023 సెప్టెంబర్ లో వచ్చిన రియల్‌మీ సి51 ఫోన్ తరువాటి తరం ఫోనుగా ఈ ఫోన్ ను తీసుకు వస్తోంది. ఇది బడ్జెట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ కాబట్టి, ఈ ఫోన్ లో బడ్జెట్ ప్రోసెసర్ మరియు ఫీచర్లు ఉండే అవకాశం ఉండవచ్చు. రియల్‌మీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇటీవలే రియల్‌మీ తన ఫ్లాగ్ షిప్ ఫోన్ Realme GT6 ను విడుదల చేసింది. ఇప్పుడు బడ్జెట్ సిరీస్ నుండి మరోక కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తోంది.