రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజే..!!

రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజే..!!
HIGHLIGHTS

Realme 9i 5G మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటీ సేల్ మొదలవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా రియల్ మీ అందించింది

రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Realme 9i 5G మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటీ సేల్ మొదలవుతుంది. ఈ లేటెస్ట్ రియల్ మీ 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్, మీడియాటెక్ 5G ప్రాసెసర్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా రియల్ మీ అందించింది. మరి ఈరోజు సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన ఆఫర్లు, ఫోన్ స్పెక్స్ మరియు పూర్తి వివరాలను తెలుసుకుందామా.  

Realme 9i 5G: ధర మరియు ఆఫర్లు

రియల్ మీ 9i 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది అవి: 

1. Realme 9i 5G(4GB + 64GB) : ధర రూ.14,999/-

2.  Realme 9i 5G(6GB  + 128GB) : ధర రూ.16,999/-

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు realme.com నుండి ఆగష్టు 24న మధ్యాహ్నం 12 గంటలకి మొదటిసారి సేల్ కి వస్తుంది. రియల్ మీ వెబ్సైట్ నుండి కొనేవారికి ICICI బ్యాంక్ అఫర్ అందుబాటులో వుంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 1,000 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ నుండి ఈ ఫోనెను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1500 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.

 Realme 9i 5G: స్పెక్స్

రియల్ మీ 9i 5G స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180 Hz టచ్ శాంప్లింగ్ కలిగి వుంటుంది. ఈ ఫోన్ 8.1 mm మందంతో సన్నని మరియు లేజర్ లైట్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ రాకింగ్ బ్లాక్ మరియు మెటాలికా గోల్డ్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.    

ఇక కెమెరాల విషయానికి వస్తే, Realme 9i స్మార్ట్ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన డిజైన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మైన్ కెమెరాకి జతగా 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 8MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది.

సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo