రియల్మీ 3 మార్చి 4 న విడుదల, ఒక Helio P70 SoC తో రావచ్చు.

Updated on 24-Feb-2019
HIGHLIGHTS

ఒక Helio P70 మరియు స్నాప్డ్రాగన్ 660 మధ్య పోలిక చూపించిన, అధికారిక పోస్ట్.

ఇండియాలో మార్చి 4 న Realme 3 ను విడుదల చేస్తామని రియల్మీ  ప్రకటించింది. రియల్ CEO అయినటువంటి, మాధవ్ సేథ్ ఒక మీడియా టెక్ హీలియో P70 మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ల మధ్య ఒక స్పెసిఫికల్ పోలికను చూపించే ఒక చిత్రాన్ని, సంస్థ యొక్క అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ఒక టీజర్ వలెనే అం అనిపిస్తోంది, అలాగే రాబోయే రియల్ 3 అంతర్గతంగా ఒక మీడియా టెక్ హీలియో P70 SoC రానున్నట్లు సూచిస్తుంది.

ఇప్పుడు తొలగించిన ట్వీట్, దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా ఒక డ్యూయల్ -కెమెరా సేటప్పుతో టీజ్ చేసిన తర్వాత, దీన్ని తొలగించింది. ఈ చిత్రంలో కూడా డైమండ్ డిజైన్ కనిపించింది. Realme U1 తరువాత ఒక మీడియా టెక్ ప్రాసెసర్ ద్వారా రానున్న మరొక రియల్మీ ఫోనుగా   ఈ రియాల్మీ3 ఉంటుంది. ఇప్పుడు పోల్చి చూస్తే, హెలియో P70 చిప్సెట్ భారీ గేమ్స్ ప్లే కోసం కూడా తక్కువ శక్తి వినియోగం, వేగవంతమైన CPU పనితీరు మరియు వేగవంతమైన డౌన్లోడ్లను కలిగి ఉంది. ఈ హీలియో P70 ను  స్నాప్ డ్రాగన్ 660 యొక్క 14nm తో పోలిస్తే 12nm ప్రక్రియపై నిర్మించబడింది.

దురదృష్టవశాత్తు, హ్యాండ్ సెట్ల యొక్క పూర్తి వివరాల సమాచారం లేదు, అయితే, ఫోన్ దాని పూర్వీకుల వలనే అతితక్కువ ధరతో వస్తుందని భావిస్తున్నారు. ఇటీవలే, షిత్ ట్విట్టర్లో రాబోయే స్మార్ట్ ఫోన్  "రియల్మే 1+ రియల్లీ 2 = బెస్ట్ పవర్ మరియు బెస్ట్ స్టైల్ అదే సెగ్మెంట్లో " అని స్పష్టం చేసాడు. షావోమి దాని రాబోయే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన, రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్నీ విడుదల చేయడానికి డేట్ ప్రకటించిన తరువాత Realme 3 టీజర్స్ వ్యూహాత్మకంగా ఆకట్టుకుంటున్నాయి .

మొదటి త్రైమాసికం చివరినాటికి రియల్మి 3 స్మార్ట్ ఫోన్ను రియల్మి కంపెనీ ప్రారంభించవచ్చని జనవరిలో ఒక నివేదిక తెలిపింది. రియల్మి 2 నుంచి తన మొబైల్ ఫోన్ను భిన్నంగా తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ట్రిపుల్ కెమెరా సెటప్ లేదా "పంచ్ హోల్ " స్క్రీనుతో ఫోన్ను ప్రారంభించాలనే ఆలోచనను కూడా ఎగ్జిక్యూటివ్  తిరస్కరించారు. కంపెనీ ఒక 48MP సెన్సారుతో ఒక హ్యాండ్ సెట్ అందించడం కోసం పనిచేస్తుందని ఆయన చెప్పారు. అయితే, Realme 3 లో 48MP సెన్సార్ ఉందా లేక లేదా అనే విషయంపైన ఎటువంటి స్పష్టత లేదు.

ఈ విషయాలన్నీ పోల్చి చూస్తే , షావోమి ఒక 48MP కెమెరాతో  దాని USP గా రెడ్మి నోట్ 7 గురించి టీజ్ చేశారు. షావోమి దాని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి, రెడ్మి నోట్ 7 ప్రారంభించేందుకు సిద్ధం ఉంది మరియు భారతదేశంలో ఫిబ్రవరి 28 న ఈ స్మార్ట్ ఫోన్నువిడుదల చెయ్యడానికి లాంచ్ డేట్ సెట్ చేసింది.ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో ప్రారంభించబడింది మరియు ఇటీవల,ఈ ఫోన్ Flipkart లో టీజ్ చెయ్యబడుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC చేత శక్తినిచ్చింది మరియు   తాజా ప్రాసెసర్ పోలికను చూస్తుంటే దీనికి సరైన పోటీగా రియల్మీ3 స్మార్ట్ ఫోన్ను రియల్మీ తీసుకురానున్నట్లు చూడవచ్చు.

 

https://twitter.com/realmemobiles/status/1098844001476591616?ref_src=twsrc%5Etfw

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :