రియల్ మీ 2 యొక్క ఇండియాలో విడుదల కార్యక్రమాన్ని ఈ రోజు మధ్యాహ్నం 12:30 గా నిర్ణయించారు : లైవ్ స్ట్రీమ్ చూడడం ఎలా , అంచనా ధరలు ,స్పెక్స్ మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం …..

రియల్ మీ 2 యొక్క ఇండియాలో విడుదల కార్యక్రమాన్ని ఈ రోజు మధ్యాహ్నం 12:30 గా నిర్ణయించారు : లైవ్ స్ట్రీమ్ చూడడం ఎలా , అంచనా ధరలు ,స్పెక్స్ మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం …..
HIGHLIGHTS

దాని మాతృ సంస్థ అయిన ఒప్పో నుండి విడిపోయిన తర్వాత మొదటి డివైజ్ గా మరియు రియల్ మీ యొక్క రెండవ స్మార్ట్ ఫోన్ రియల్ మీ 2 గా భారతదేశంలో విడుదలవనుంది.

రియల్ మీ దాని రెండవ స్మార్ట్ ఫోన్  రియల్మ్ 2 ను ఇండియా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఇది ఒప్పో నుండి బయటికి వచ్చిన  తర్వాత సంస్థ యొక్క మొట్టమొదటి డివైజ్. ఈ స్మార్ట్ ఫోన్ ని నేడు 12:30 PM కి జరిగే ఒక కార్యక్రమం లో ఆవిష్కరించనున్నారు మరియు ఈ డివైజ్ ఇప్పటికే ఒక ఫ్లిప్ కార్ట్ ఎక్స్క్లూజివ్ గా ఉంటుందని మనకి తెలుసు. స్మార్ట్ఫోన్ కోసం ప్రత్యేక మైక్రో సైట్ ని  ఫ్లిప్ కార్ట్ ఉంచింది, రాబోయే డివైజ్ యొక్క కొన్ని ఫీచర్స్ అధికారికంగా వెల్లడించబడ్డాయి. ఈ హ్యాండ్సెట్ 6.2 అంగుళాల నొచ్ డిస్ప్లేని కలిగి ఉంటుంది మరియు డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఒక పెద్ద 4230 mAh బ్యాటరీ కూడా ఇందులో నిర్ధారించబడింది.

రియల్ మీ 2 ప్రారంభోత్సవం : లైవ్ స్ట్రీమ్ చూడడం ఎలా

రియల్ మీ ప్రత్యక్షంగా  ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి దాని సోషల్ మీడియా చానెల్ ద్వారా ప్రసారమవుతుంది. అయితే, దిగువ పొందుపరచిన వీడియో నుండి నేరుగా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. పైన చెప్పినట్లుగా, ఈ కార్యక్రమానికి 12:30 గంటలకు ప్రారంభమవుతుంది.

రియల్ మీ 2 గురించి పుకార్లలోవున్న స్పెసిఫికేషన్స్ మరియు ధరలు

ధరల ప్రకారంగా, ఈ స్మార్ట్ఫోన్ ఒక మధ్య రేంజర్ అని పుకార్లు వచ్చాయి, ఇది రూ. 10,000 క్రింద ప్రారంభమవుతుంది మరియు టాప్ డివైజ్ కోసం రూ .15,000 వరకు ఉంటుంది అని.  ఈ హ్యాండ్సెట్ ప్రధమంగా సరసమైన ధరలో ఒక పెద్ద నోచ్ తో పెద్ద డిస్ప్లేని తీసుకువచ్చేదిగా కంపెనీ ప్రకటించింది.

ఇటీవలే, Realme 2 చిత్రాలు అనుకోకుండా కంపెనీ వెబ్సైట్లో ప్రత్యక్షంగా కనిపించాయి. ఈ ఫోటోలు ప్రకారం, స్మార్ట్ఫోన్ ఈ సమయంలో వెనుకవైపు ఫింగర్  సెన్సార్ ని కలిగి ఉండవచ్చు. దీనికి ముందు వచ్చిన రియల్ 1 (సమీక్ష) కి  ఈ ఫీచర్ లేదు. రాబోయే స్మార్ట్ఫోన్ దాని వెనుక ప్యానెల్లో అదే రూపకల్పన నమూనాను కూడా కలిగి ఉంటుంది, ఇది దాని పూర్వ మరియు OPPO F7 డైమండ్ బ్లాక్ ఎడిషన్లో ఉపయోగించబడింది. ఈ చిత్రంలో నలుపు మరియు నీలం కాల్ వేరియెంట్ డివైజ్లను వెల్లడించారు.

 రియల్ మీ 2 యొక్క హార్డ్వేర్ గురించి ఎక్కువగా తెలియరాలేదు. అయినప్పటికీ, హ్యాండ్సెట్ ఒప్పో F7 లాంటి ఆకృతీకరణను అందిస్తుందని మరియు 6.23-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే కలిగివున్నట్లు వదంతులు సూచిస్తున్నాయి. ఇది గతంలో మీడియా టెక్ హీలియో P60 SoC చేత శక్తినివ్వటానికి ఊహించబడింది కాని సంస్థ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రక్రియలో రన్ అవుతుందని ఇటీవలే ట్వీట్ చేసింది. ఈ డివైజ్ 16ఎంపీ  + 2ఎంపీ వెనుక కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo