Realme 14x 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో సెగ్మెంట్ ఫస్ట్ IP69 రేటింగ్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. అంటే, ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ 85 డిగ్రీల వేడి నీటిలో పడినా కూడా ఏమీ కాదని కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుందని కూడా రియల్ మీ టీజ్ చేస్తోంది.
రియల్ మీ 14x 5జి స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
రియల్ మీ 14x స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ బెస్ట్ ప్రోసెసర్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ను అమితమైన వేగంగా మార్చడానికి వీలుగా ఈ అప్ కమింగ్ ఫోన్ ను 18GB డైనమిక్ ర్యామ్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందిస్తున్నట్లు రియల్ మీ తెలిపింది.
ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో పవర్ ఫుల్ బ్యాటరీ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను రెండు రోజుల పవర్ అందించే 6000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను 45W ఫాస్ట్ ఛార్జ్ తో వేగంగా ఛార్జ్ చేయగల ఛార్జ్ టెక్ తో కూడా అందిస్తుంది.
Also Read: Lava Blaze Duo: ఊహించనంత చవక ధరకే డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్.!
ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది మరియు ఇది గొప్ప డీటెయిల్స్ తో ఫోటోలు అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ను కంపెనీ అండర్ 15K ఫస్ట్ IP69 స్మార్ట్ ఫోన్ గా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 15,000 రూపాయల కంటే తక్కువ ధరకే లాంచ్ అవుతుందని కంపెనీ హింట్ కూడా ఇచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ 85 డిగ్రీల వేడి నీటిలో ముగినా కూడా ఏమి కాదని కూడా చెబుతోంది