Realme 14x 5G సెగ్మెంట్ ఫస్ట్ IP69 రేటింగ్ స్మార్ట్ ఫోన్ గా విడుదలకు సిద్ధం.!

Realme 14x 5G సెగ్మెంట్ ఫస్ట్ IP69 రేటింగ్ స్మార్ట్ ఫోన్ గా విడుదలకు సిద్ధం.!
HIGHLIGHTS

సెగ్మెంట్ ఫస్ట్ IP69 రేటింగ్ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మీ

Realme 14x 5G ఫోన్ 85 డిగ్రీల వేడి నీటిలో పడినా కూడా ఏమీ కాదట

ఈ ఫోన్ ను కంపెనీ అండర్ 15K ఫస్ట్ IP69 స్మార్ట్ ఫోన్ గా టీజింగ్ చేస్తోంది

Realme 14x 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో సెగ్మెంట్ ఫస్ట్ IP69 రేటింగ్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. అంటే, ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ 85 డిగ్రీల వేడి నీటిలో పడినా కూడా ఏమీ కాదని కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుందని కూడా రియల్ మీ టీజ్ చేస్తోంది.

Realme 14x 5G : లాంచ్

రియల్ మీ 14x 5జి స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.

Realme 14x 5G : ఫీచర్స్

రియల్ మీ 14x స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ బెస్ట్ ప్రోసెసర్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ను అమితమైన వేగంగా మార్చడానికి వీలుగా ఈ అప్ కమింగ్ ఫోన్ ను 18GB డైనమిక్ ర్యామ్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందిస్తున్నట్లు రియల్ మీ తెలిపింది.

Realme 14x 5G

ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో పవర్ ఫుల్ బ్యాటరీ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను రెండు రోజుల పవర్ అందించే 6000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను 45W ఫాస్ట్ ఛార్జ్ తో వేగంగా ఛార్జ్ చేయగల ఛార్జ్ టెక్ తో కూడా అందిస్తుంది.

Also Read: Lava Blaze Duo: ఊహించనంత చవక ధరకే డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్.!

ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది మరియు ఇది గొప్ప డీటెయిల్స్ తో ఫోటోలు అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ను కంపెనీ అండర్ 15K ఫస్ట్ IP69 స్మార్ట్ ఫోన్ గా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 15,000 రూపాయల కంటే తక్కువ ధరకే లాంచ్ అవుతుందని కంపెనీ హింట్ కూడా ఇచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ 85 డిగ్రీల వేడి నీటిలో ముగినా కూడా ఏమి కాదని కూడా చెబుతోంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo