Realme 14x 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత పటిష్టమైన IP69 రేటింగ్ మరియు ప్రీమియం డైమండ్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ప్రీమియం ఫోన్ లలో మాత్రమే అందించే IP69 రేటింగ్ మరియు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో రియల్ మీ లాంచ్ చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 14,999 ధరతో మరియు (8GB + 128GB) వేరియంట్ ను రూ. 15,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మంచి బ్యాంక్ ఆఫర్ తో కూడా అందించింది.
ఈ ఫోన్ పై All Banks Credit మరియు Debit కార్డ్స్ రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ను ఈరోజు నుంచే మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను Flipkart మరియు realme.com నుంచి లభిస్తుంది.
రియల్ మీ 14x 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ HD+ LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ప్రీమియం డైమండ్ డిజైన్ మరియు 85 డిగ్రీల వేడితిని కూడా తట్టుకునేలా IP69 రేటింగ్ తో అందించినట్లు రియల్ మీ గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ సోనిక్ వాటర్ ఎజెక్షన్ మరియు షాక్ రెసిస్టెన్స్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ ను Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6GB మరియు 8GB ర్యామ్ ఆప్షన్ లతో మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో పెద్ద 6000 mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.
Also Read: OnePlus 13 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ.!
ఇక ఈ ఫోన్ లో అందించిన కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ తో అందించింది. అలాగే, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరాతో 1080p వీడియోలు 3fps వద్ద షూట్ చేయవచ్చు.