Realme 14X 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ.!
Realme 14X 5G ను ఇండియాలో విడుదల చేస్తుందని రియల్ మీ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు కఠినమైన బిల్డ్ తో తీసుకు వస్తోంది
ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది
Realme 14X 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తుందని రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు కఠినమైన బిల్డ్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పై ఒక లుక్కేద్దామా.
Realme 14X 5G : లాంచ్
రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ప్రకటించింది. కానీ, ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. ఫ్లిప్ కార్ట్ కూడా ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది.
Realme 14X 5G : ఫీచర్స్
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 14X 5G మూడు కలర్ వేరియంట్లలో కనిపిస్తోంది. ఇందులో ఎరుపు, గ్రే మరియు లైట్ క్రీమ్ కలర్ ని పోలిన కలర్స్ లో ఉన్నాయి. అయితే, వీటి ఖచ్చితమైన కలర్స్ కంపెనీ తెలిపే వరకు మనం వీటిని అంచనా కలర్స్ గా మాత్రమే చూడాలి.
రియల్ మీ 14X 5జి స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ గా కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ చూడడానికి చాలా ప్రీమియం లుక్స్ తో కనిపిస్తోంది. ఇది కాకుండా, ఈ ఫోన్ చాలా కఠిమైనదిగా ఉంటుందని కంపెనీ చేసిన టీజింగ్ ద్వారా ఈ ఫోన్ మంచి పటిష్టమైన డిజైన్ ను కలిగి ఉంటుందని మనం ఊహించవచ్చు.
ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ ను డైమండ్ డిజైన్ తో అందిస్తున్నట్లు రియల్ మీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఫోన్ లో కెమెరా సెటప్ ను ఓల్డ్ స్కూల్ కెమెరా బంప్ తో అందిస్తోందని, ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా అర్థం అవుతోంది. ఎందుకంటే, ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న రౌండ్ బంప్ నుంచి ఇది ఈ ఫోన్ ను వేరు చేసింది.
Also Read: Sony Bravia 2 పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అందించిన అమెజాన్.!
ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా రియల్ మీ త్వరలోనే వెల్లడిస్తుంది.