Realme 14 Pro Series: 120X జూమ్ మరియు ట్రిపుల్ ఫ్లాష్ కెమెరాతో వస్తోంది.!

Updated on 31-Dec-2024
HIGHLIGHTS

Realme 14 Pro Series కొత్త సంవత్సరంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది

20X జూమ్ మరియు ట్రిపుల్ ఫ్లాష్ కెమెరాతో వస్తుంది

ఈ ఫోన్ వరల్డ్ ఫస్ట్ కోల్డ్ సెన్సిటివ్ ఫోన్ కూడా అవుతుంది

Realme 14 Pro Series: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కొత్త సంవత్సరం ప్రారంభంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క లాంచ్ డేట్ ను రియల్ మీ ఇంకా వెల్లడించలేదు కానీ జనవరి నెలలో విడుదలవుతుందని మాత్రం అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ 120X జూమ్ మరియు ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటాయని రియల్ మీ టీజింగ్ చేస్తుంది.

Realme 14 Pro Series: ఫీచర్స్

రియల్ మీ 14 ప్రో సిరీస్ ను 2025 జనవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ త్వరలో లాంచ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ కొన్ని యూనిక్ ప్రత్యేకతలను కలిగి ఉంటుందని కంపెనీ టీజ్ చేస్తోంది.

ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు ప్రపంచపు మొట్టమొదటి ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా ఫోన్స్ గా ఉంటాయి. ఈ ప్రత్యేకతను వెల్లడించే టీజర్ ఇమేజ్ తో కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ సిరీస్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ప్రతి కెమెరా మధ్యలో ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 120x జూమ్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది.

ఈ కొత్త ట్రిపుల్ ఫ్లాష్ లైట్ సెటప్ ద్వారా రాత్రి సమయాలు మరియు తక్కువ వెలుగు కలిగిన ప్లేస్ లలో కూడా ప్రకాశవంతమైన పోర్ట్రైట్ లు మరియు ఫోటోలు పొందవచ్చని రియల్ మీ తెలిపింది. ఇదే కాదు ఈ ఫోన్ వరల్డ్ ఫస్ట్ కోల్డ్ సెన్సిటివ్ ఫోన్ కూడా అవుతుంది. అంటే, ఈ ఫోన్ ను తక్కువ టెంపరేచర్ ను చేరుకున్నప్పుడు ఫోన్ కలర్ మారుతుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ సూపర్ డీల్: 23 వేలకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

రియల్ మీ ఈ ఫోన్ యొక్క డేట్ అనౌన్స్ చేయకుండానే ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో ఇంకా ఎన్ని ఫీచర్స్ బయటపెడుతుందో చూడాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :