Realme 14 Pro Series: రియల్ మీ యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ రియల్ మీ 14 ప్రో సిరీస్ 5జి యొక్క లాంచ్ డేట్ ని ఈ రోజు ప్రకటించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి రానున్న స్మార్ట్ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ సిరీస్ నుంచి అందించనున్న స్మార్ట్ ఫోన్స్ యొక్క కలర్ వేరియంట్స్ మొదలుకొని మరిన్ని వివరాలు కంపెనీ వెల్లడించింది.
రియల్ మీ 14 ప్రో సిరీస్ 5జి ని జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ‘So Clear, So Powerful’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తోంది.
రియల్ మీ 14 ప్రో సిరీస్ నుంచి 14 Pro 5G మరియు 14 Pro+ 5G ఫోన్ లను లాంచ్ చేస్తోంది. ఈ రెండు ఫోన్ లను కూడా విలక్షణమైన సరికొత్త కలర్ చేంజింగ్ ఫీచర్ మరియు సరికొత్త కలర్ లతో పాటు ప్రీమియం లెథర్ డిజైన్ లో కూడా అందిస్తోంది.
ఈ సిరీస్ ఫోన్ లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను ట్రిపుల్ రియర్ ఫ్లాష్ సెటప్ ఆటో జతగా అందిస్తోంది. ప్రపంచంలో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోన్ కేవలం 7.55mm తో సూపర్ స్లిమ్ గా ఉంటుంది. ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ తో ఉంటుంది మరియు 3840Hz PWM డిమ్మింగ్ ఫీచర్ తో కూడా ఉంటుంది.
Also Read: Redmi 14C 5G ను చవక ధరలో లాంచ్ చేసిన షియోమీ: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ లలో వెనుక Hyper Image+ మరియు 120X జూమ్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్ లను Suede Gray, జైపూర్ పింక్ మరియు బికనీర్ పర్పల్ కలర్ లలో లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ తెలిపింది.