Realme 14 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదల అయ్యింది. రియల్ మీ 14 ప్రో సిరీస్ 5జి నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కొత్త డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చింది. ఈ ఫోన్ ను సరికొత్త కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ డిజైన్, IP69 రేటింగ్, పెద్ద టైటాన్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ యొక్క ధర, ఆఫర్స్ మరియు ఫీచర్లు వివరంగా తెలుసుకోండి.
రియల్ మీ ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ వేరియంట్ (8GB + 128GB) రూ. 24,999 ధరతో హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) రూ. 26,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ పర్ల్ వైట్, జైపూర్ పింక్ మరియు సూడే గ్రే మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ మంచి ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై ఆల్ బ్యాంక్ రూ. 2,000 రూపాయల ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకు అందుకోవచ్చని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ Pre-Orders ను ఈరోజు నుంచే కంపెనీ మొదలు పెట్టింది.
జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
రియల్ మీ 14 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ కర్వుడ్ OLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Energy 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ కొత్త ఫోన్ లో వెనుక ట్రిపుల్ ఫ్లాష్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP (Sony IMX882) మెయిన్ మరియు 2MP మోనోక్రోమ్ కెమెరాలు ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ తో 30fps వద్ద 4K వీడియోలు మరియు క్లియర్ ఫోటోలు షూట్ చేసే అవకాశం ఉంటుందని రియల్ మీ తెలిపింది.
Also Read: 43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ 4K Smart TV అందుకోండి.. ఎక్కడంటే.!
ఈ ఫోన్ లో Dual Speakers ను కూడా అందించింది. ఈ ఫోన్ realme UI 6.0 సాఫ్ట్ వేర్ పై Android 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ ను 6000 mAh టైటాన్ బ్యాటరీ మరియు 45W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ IP69 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ తో కూడా ఉంటుంది.