Realme 14 Pro 5G: కొత్త డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చింది.!
Realme 14 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదల అయ్యింది
ఈ స్మార్ట్ ఫోన్ కొత్త డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చింది
Realme 14 Pro 5G పై కంపెనీ మంచి ఆఫర్లు అందించింది
Realme 14 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదల అయ్యింది. రియల్ మీ 14 ప్రో సిరీస్ 5జి నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కొత్త డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చింది. ఈ ఫోన్ ను సరికొత్త కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ డిజైన్, IP69 రేటింగ్, పెద్ద టైటాన్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ యొక్క ధర, ఆఫర్స్ మరియు ఫీచర్లు వివరంగా తెలుసుకోండి.
Realme 14 Pro 5G: ప్రైస్
రియల్ మీ ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ వేరియంట్ (8GB + 128GB) రూ. 24,999 ధరతో హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) రూ. 26,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ పర్ల్ వైట్, జైపూర్ పింక్ మరియు సూడే గ్రే మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
ఆఫర్స్
ఈ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ మంచి ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై ఆల్ బ్యాంక్ రూ. 2,000 రూపాయల ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకు అందుకోవచ్చని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ Pre-Orders ను ఈరోజు నుంచే కంపెనీ మొదలు పెట్టింది.
జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Realme 14 Pro 5G: ఫీచర్స్
రియల్ మీ 14 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ కర్వుడ్ OLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Energy 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ కొత్త ఫోన్ లో వెనుక ట్రిపుల్ ఫ్లాష్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP (Sony IMX882) మెయిన్ మరియు 2MP మోనోక్రోమ్ కెమెరాలు ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ తో 30fps వద్ద 4K వీడియోలు మరియు క్లియర్ ఫోటోలు షూట్ చేసే అవకాశం ఉంటుందని రియల్ మీ తెలిపింది.
Also Read: 43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ 4K Smart TV అందుకోండి.. ఎక్కడంటే.!
ఈ ఫోన్ లో Dual Speakers ను కూడా అందించింది. ఈ ఫోన్ realme UI 6.0 సాఫ్ట్ వేర్ పై Android 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ ను 6000 mAh టైటాన్ బ్యాటరీ మరియు 45W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ IP69 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ తో కూడా ఉంటుంది.