Realme 13 Series 5G: కొత్త చిప్ సెట్ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ తో లాంచ్ అవుతుంది.!

Updated on 22-Aug-2024
HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ తో టీజింగ్ కూడా రియల్ మీ మొదలు పెట్టింది

Realme 13 Series 5G ఫోన్ ను 80W ఫాస్ట్ ఛార్జ్ తో తీసుకు వస్తున్నట్లు చెబుతోంది

Realme 13 Series 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ తో టీజింగ్ కూడా రియల్ మీ మొదలు పెట్టింది. ఈ ఫోన్ లను కొత్త చిప్ సెట్ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ వంటి చాలా ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్లు చెబుతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో ఆటపట్టిస్తోంది.

Realme 13 Series 5G లాంచ్ డేట్ ఏమిటి?

రియల్ మీ 13 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు డేట్ మరియు టైం ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది మరియు ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం గత కొంత కాలంగా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజితో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను ఈ మైక్రో సైట్ పేజి నుంచి అనౌన్స్ చేసి టీజింగ్ చేస్తోంది.

Realme 13 Series 5G : ఫీచర్స్

రియల్ మీ 13 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను మీడియాటెక్ యొక్క లేటెస్ట్ బడ్జెట్ ఫాస్ట్ చిప్సెట్ Dimensity 7300 Energy తో అందిస్తుందని రియల్ మీ తెలిపింది. ఈ చిప్ సెట్ 7,50,000 పై చిలుకు AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. దీనికి జతగా 26 GB ర్యామ్ మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని కూడా కంపెనీ ప్రకటించింది.

Also Read: Honor Days Sale నుంచి భారీ ఆఫర్ తో రూ. 19,998 కే లభిస్తున్న 30 వేల రూపాయల ఫోన్.!

ఈ ఫోన్ లో వెనుక ఈ ఫోన్ లో 90fps వద్ద గేమింగ్ కోసం తగిన స్క్రీన్ వుంది. అత్యంత వేగంగా స్మార్ట్ ఫోన్ ను ఛార్జ్ చేయగల 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ మరియు రెండు డిఫరెంట్ కలర్ లలో అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :