Realme 13 Pro Series: రియల్‌మీ ఇండియాలో పవర్ ఫుల్ కెమెరా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కెమెరా ప్రత్యేకమైన ఫోన్ గా తీసుకొస్తున్నట్లు ఆటపట్టిస్తోంది. రియల్‌మీ 13 ప్రో సిరీస్ ను ఇండియాలో లాంచ్ చేయబొతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను మొదటి ప్రొఫెషనల్ AI కెమెరా అవుతుంది, అని రియల్‌మీ ఆటపట్టిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించి టీజర్ ద్వారా ఈ వివరాలు అందించింది.
రియల్‌మీ 13 ప్రో సిరీస్ భారత్ మార్కెట్ లో త్వరలో లాంచ్ అవుతాయని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart ని సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. ఈ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తుంది మరియు ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటుగా కీలకమైన ఫీచర్స్ ను కూడా త్వరలో ప్రకటించే అవకాశం వుంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ను చూస్తుంటే, ఈ ఫోన్ లో వెనుక భారీ కెమెరా సెటప్ ఉన్నట్లు అర్థం అవుతోంది.
రియల్‌మీ 13 ప్రో సిరీస్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ వెనుక Hyper Image + అని రాసి ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ మొదటి ప్రొఫెషనల్ AI కెమెరాగా తీసుకొస్తున్నట్లు కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ రెండు విషయాలు ఈ ఫోన్ కెమెరా గురించి ఆలోచింపచేసేలా చేస్తున్నాయి. ఇందులో కూడా 12 సిరీస్ మాదిరిగా ఫోన్ వెనక రౌండ్ కెమెరా బంప్ వుంది.
Also Read: WhatsApp AI avatar: సింగిల్ క్లిక్ తో అవతార్ క్రియేట్ చేసే కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్.!
రియల్‌మీ అధికారిక వెబ్సైట్ లో ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుండి గొప్ప కెమెరా సిస్టం తో ముందుగా వచ్చిన చాలా స్మార్ట్ ఫోన్ లను కూడా చూపించింది. ఇందులో ప్రో సిరీస్ నుంచి అందించిన బెస్ట్ కెమెరా ఫోన్ లను చూపించింది. ఈ లిస్ట్ లో 108MP కెమెరాతో వచ్చిన రియల్‌మీ 10 ప్రో సిరీస్, 200MP కెమెరాతో వచ్చిన రియల్‌మీ 11 ప్రో సిరీస్ మరియు టాప్ రేటెడ్ కెమెరా ఫోన్ గా ఎంపికైనట్లు చెబుతున్న రియల్‌మీ 12 ప్రో సిరీస్ ఫోన్స్ గురించి ప్రస్తావించింది.
ఈ టీజర్ ద్వారా ఈ ఫోన్ కెమెరా ప్రత్యేకమైన ఫోన్ అవుతుందని రియల్‌మీ చెబుతోంది.