రియల్‌మీ ఇండియాలో విడుదల చేయబోతున్న Realme 13 Pro Series 5G ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ ఫోన్ ను డ్యూయల్ 50MP Sony కెమెరాలతో మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలియజేయడమే ఇందుకు కారణం. ఈ ఫోన్ ను సోనీ లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త సెన్సార్ తో తీసుకు వస్తోందిట. ఇదే కాదు ఈ ఫోన్ లో మరిన్ని AI ఫీచర్లు ఉన్నట్లు కూడా రియల్‌మీ కన్ఫర్మ్ చేసింది.
రియల్‌మీ 13 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ లను త్వరలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ప్రకటించలేదు కానీ ఈ ఫోన్ ఫీచర్ లతో ఈ ఫోన్ పై భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ ను రియల్‌మీ బయట పెట్టింది.
రియల్‌మీ 13 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ లలో డ్యూయల్ 50MP కెమెరాలు ఉన్నట్లు రియల్‌మీ తెలిపింది. AI అల్ట్రా క్లారిటీ ఫీచర్ తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే అవుతుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 50MP Sony LYT-701 సెన్సార్ కలిగిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP Sony LYT-701 పెరిస్కోప్ కెమెరా కూడా వుంది.
AI సపోర్ట్ తో ఈ ఫోన్ ను రియల్‌మీ లాంచ్ చేస్తోంది. సోనీ సెన్సార్ లు, ఫస్ట్ క్లాస్ ఆప్టిక్స్ మరియు కటింగ్ ఎడ్జ్ AI సపోర్ట్ తో ఈ ఫోన్ DSLR వంటి అల్ట్రా క్లియర్ ఇమేజ్ లను అందిస్తుందని రియల్‌మీ తెలిపింది. AI ఇన్నోవేషన్ కోసం రియల్‌మీ HYPERIMAGE+ ని డెవలప్ చేసినట్లు కూడా ఈ సందర్భంగా రియల్‌మీ తెలియచేసింది.
Also Read: Samsung Galaxy M35 5G లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.!
రియల్‌మీ 13 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ లలో అందించిన AI సహాయంతో ఇమేజ్ ఎన్హెన్స్, ఎడిటింగ్, అబ్జెక్ట్ రిమూవ్ వంటి మరిన్ని పనులను చిటికెలో చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని రియల్‌మీ ప్రత్యేకంగా చెబుతోంది. రియల్‌మీ 13 ప్రో సిరీస్ ఫోన్ లతో స్టన్నింగ్ పోర్ట్రైట్స్, సూపర్ లో లైట్ పిక్చర్స్ మరియు హై రిజల్యూషన్ వీడియో లను ఆశించవచ్చని తెలిపింది.