Realme 13 Pro Plus 5G: రియల్ మీ ఈరోజు 13 ప్రో సిరీస్ ను విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను బెస్ట్ కెమెరా మరియు డిజైన్ తో అందించినట్లు లాంచ్ సమయంలో రియల్ మీ గొప్పగా చెప్పింది. ఈరోజే భారత మార్కెట్లో సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
రియల్ మీ 13 ప్రో ప్లస్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 32,999 ధరలో విడుదల చేసింది. అలాగే, ఈ ఫోన్ రెండవ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 34,999 ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ హైఎండ్ వేరియంట్ (12GB + 512GB) రూ. 34,999 ధరలో అందించింది. ఆగస్టు 6 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు realme అధికారిక సైట్ నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
ఈ రియల్ మీ 13 ప్రో ప్లస్ ఫోన్ పై బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్ లను రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ ను HDFC, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చని రియల్ మీ తెలిపింది.
రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.7 ఇంచ్ Curved డిస్ప్లే తో అందించింది. ఈ స్క్రీన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్,1.07 బిలియన్ కలర్ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫోన్ ను Snapdragon 7s Gen 2 లేటెస్ట్ చిప్ సెట్ మరియు జతగా 12GB ర్యామ్ + 12GB అదనపు ర్యామ్ ఫీచర్ తో తీసుకు వచ్చింది. అంతేకాదు ఈ ఫోన్ 256GB మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది.
ఈ ఫోన్ యొక్క కెమెరా పరంగా కొనియాడబడుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT- 701 + 50MP Sony LYT- 600 పెరిస్కోప్ మరియు అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ DSLR వంటి గొప్ప పోర్ట్రైట్ మరియు ఫోటోలను అందిస్తుందని రియల్ మీ తెలిపింది.
Also Read: 10 వేల బడ్జెట్ లో మంచి 32 ఇంచ్ Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా.!
ఈ ఫోన్ కెమెరాతో 60fps వద్ద 4K UHD వీడియోలు షూట్ చేయవచ్చని కూడా రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో ముందు 32MP Sony సెల్ఫీ కెమెరా వుంది మరియు ఈ ఫోన్ రియర్ కెమెరా 120x డిజిటల్ జూమ్ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా AI స్మార్ట్ రిమూవల్ వంటి గుట్టల కొద్దీ AI ఫీచర్స్ ను కూడా కలిగి ఉండడమే కాకుండా హైపర్ ఇమేజ్ అనే కొత్త ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ ను గట్టిగా ఉండేలా స్విస్ SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ తో తయారు చేసినట్లు రియల్ మీ చెబుతోంది. 13 ప్రో ప్లస్ ఫోన్ లో 5200 mAh బ్యాటరీ వుంది మరియు ఇది 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.