Realme 13 Pro+ 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ రియల్ మీ 13 ప్రో సిరీస్ నుంచి వస్తున్న 13 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ తో వచ్చే వారం లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అవ్వడానికి ఇంకా వారం రోజులు ఉండగా, వారం ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్లు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. వాస్తవానికి, సిరీస్ నుంచి రెండు ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్ట్ కలిగిన కెమెరా మరియు ఫీచర్స్ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ జూలై 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతుంది. ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్ ను రియల్ మీ నిర్వహిస్తోంది మరియు ఈ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ తో పాటు రియల్ మీ 13 ప్రో ఫోన్ ను కూడా విడుదల చేస్తుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో చాలా కాలంగా రియల్ మీ టీజింగ్ చేస్తోంది. మరి ముఖ్యంగా ఈ ఫోన్ కెమెరా మరియు AI ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెబుతోంది. రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 50MP Sony LYT – 701 మెయిన్ మరియు 50MP Sony LYT – 600 పెరిస్కోప్ కెమెరా కలిగిన వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ ఇదే అని కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ కెమెరా DSLR కెమెరాలతో పోటీకి నిలబడేలా ఫోటోలను అందిస్తుందని రియల్ మీ చెబుతోంది.
ఈ ఫోన్ రియల్ మీ Hyperimage+ AI కెమెరా సిస్టం కలిగిన మొదటి ఫోన్ కూడా అవుతుంది. ఈ ఫోన్ లో AI అల్ట్రా క్లియర్, AI స్మార్ట్ రిమూవల్, AI ఫోటో ఎన్హెన్స్, AI ఆడియో జూమ్ వంటి గుట్టల కొద్దీ AI ఫీచర్లు ఉన్నట్లు రియల్ మీ ఇప్పటికే కెమెరా వివరాలు బయటపెట్టింది. అయితే, ఇతర వివరాలు మాత్రం బయట పెట్టలేదు. కానీ నెట్టింట్లో ఈ ఫోన్ తో తీసిన ఫోటోలు మరియు ఈ ఫోన్ అంతర్గత వివరాలు తెలిపే స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
నెట్టింట్లో దర్శనమిచ్చిన స్క్రీన్ షాట్స్ ద్వారా, ఈ ఫోన్ 6.7 ఇంచ్ Curved డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ లో 50MP మెయిన్ + 8MP వైడ్ + 50MP పెరిస్కోప్ కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
Also Read: Flipkart GOAT sale నుంచి మంచి డిస్కౌంట్ తో 30 లోపలే లభిస్తున్న Samsung Smart Tv డీల్స్ ఇవే.!
రియల్ మీ 13 ప్రో ప్లస్ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా 8GB ర్యామ్ మరియు 8GB అదనపు ర్యామ్ ఫీచర్ కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 5200mAh బిగ్ బ్యాటరీ తో కూడా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ ఛార్జ్ సపోర్ట్ వివరాలు మాత్రం బయటికి రాలేదు. రియల్ మీ 13 ప్రో ప్లస్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Realme UI 5.0 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ Android 14OS పై నడుస్తుంది, అని ఆన్లైన్ లో దర్శనమిచ్చిన స్క్రీన్ షాట్స్ చెబుతున్నాయి.