Realme 13 Pro+ 5G: రియల్ మీ 13 ప్రో సిరీస్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్ లను ఇండియాలో విడుదల చేస్తోంది. అయితే, వీటిలో రియల్ మీ 13 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ ను కంపెనీ ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫోన్ ను ఈ టాప్ 5 ఫీచర్స్ తో తీసుకు వస్తుందని క్లియర్ అయ్యింది. రేపు ఇండియాలో విడుదల కాబోతున్న రియల్ మీ 13 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ పైన ఒక లుక్కేద్దాం.
రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తుంది. ఈ టీజర్ పేజీ నుండి ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ ను అందించింది.
ఈ ఫోన్ యొక్క కెమెరా గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో రెండు Sony పవర్ ఫుల్ సెన్సార్ లు ఫీచర్స్ తో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో, 50MP Sony LYT – 701 + 50MP Sony LYT – 600 రెండు పవర్ ఫుల్ కెమెరా లకు జతగా మరో కెమెరా కలిగి ఉంటుంది. ఈ రెండు కెమెరాలు కూడా OIS సపోర్ట్ ను కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ రెండు సోనీ కెమెరాలు కూడా OIS సపోర్ట్ ను కలిగి ఉంటాయి.
రియల్ మీ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లో AI కెమెరా మరియు హైపర్ ఇమేజ్ ప్లస్ సపోర్ట్ వుంది. ఈ రెండు ఫీచర్స్ తో ఈ ఫోన్ తో అద్భుతమైన క్లారిటీ కలిగిన ఫోటోలు మరియు వీడియోలు పొందవచ్చని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ కెమెరా 120x జూమ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, AI స్మార్ట్ రిమూవల్, AI గ్రూప్ ఫోటో ఎన్ హెన్స్మెంట్ మరియు AI ఆడియో జూమ్ వంటి చాలా AI ఫీచర్స్ కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది.
ఈ ఫోన్ గొప్ప డ్యూరబిలిటీ మరియు డిస్ప్లే పైన శక్తివంతమైన గ్లాస్ ను కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో అందిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ఈ స్విస్ SGS 5 – స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తుందని కూడా తెలిపింది.
Also Read: Airtel Plans: రేట్లు పెరిగిన తర్వాత కూడా Amazon Prime తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
రియల్ మీ 13 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను 5200 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ వేగవంతమైన 80W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది.
ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ Snapdragon 7 Series చి చిప్ సెట్ తో లాంచ్ అవుతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ ను అత్యంత వేగంగా చల్లబరిచే 3D VC కూలింగ్ ఫీచర్ తో లాంచ్ చేస్తోంది.