Realme 13 Pro 5G now available at lowest price ever from amazon
Realme 13 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరలో సేల్ అవుతోంది. మోనెట్ ఇన్స్పైర్డ్ డిజైన్, పవర్ ఫుల్ డిస్ప్లే మరియు చిప్ సెట్ తో వచ్చిన ఈ ఫోన్ ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సేల్ అందుకోవచ్చు. ఈ అవకాశాన్ని అమెజాన్ ఇండియా అందించింది. వాస్తవానికి, రియల్ మీ ఈ ఫోన్ పై రూ. 5,000 భారీ తగ్గింపు అందించింది. అయితే, ఈ ఫోన్ అమెజాన్ నుంచి ఇంకా భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. మరి ఈ ఫోన్ పై అమెజాన్ అందించిన ఆ భారీ ఆఫర్లు ఏమిటో చూద్దామా.
రియల్ మీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 26,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుంచి కేవలం రూ. 19,999 రూపాయల ధరలో సేల్ అవుతోంది. అంటే, అమెజాన్ ఈ ఫోన్ పై ఏకంగా రూ. 7,000 తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ పై కంపెనీ రీసెంట్ గా రూ. 5,000 తగ్గింపు ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రియల్ మీ వెబ్సైట్ నుంచి రూ. 21,999 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, అమెజాన్ నుంచి ఈ ఫోన్ ను తక్కువ ధరకు అందుకోవచ్చు.
ఇది కాకుండా ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై రూ. 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. DBS క్రెడిట్ కార్డు తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ చెక్ చేయడానికి Click Here
Also Read: Soundbar Deal: కేవలం 8 వేలకే 400W Dolby Atmos జబర్దస్త్ సౌండ్ బార్ అందుకోండి.!
ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ OLED Pro-XDR కర్వుడ్ స్క్రీన్ ను 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2160Hz హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ ఫోన్ 50MP OIS (Sony LYT-600) మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాతో పాటు 32MP సోనీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, వీడియో జూమ్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5200 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.
ఈ ఫోన్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి.