Realme 13+ 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను రియల్ మీ 13 సిరీస్ నుంచి ఈ రోజు ప్రకటించింది. ఈ రోజు జరిగిన ఈవెంట్ నుంచి రియల్ మీ 13 ప్లస్ 5జి మరియు రియల్ మీ 13 రెండు ఫోన్లను విడుదల చేసింది. అయితే, రియల్ మీ 13 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను భారీ గేమింగ్ మరియు కెమెరా ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ చేసింది.
రియల్ మీ 13 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ నుస్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వచ్చే బేసిక్ వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది. 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 24,999 ధరతో ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ ను 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ. 26,999 ధరతో లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ ను పైన రూ. 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart, కంపెనీ అధికారిక వెబ్సైట్ realme.com మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ ల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
రియల్ మీ 13 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ E4 AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ తో జతగా వస్తుంది. ఈ స్క్రీన్ Pro-XDR ఫీచర్ తో 90FPS వద్ద PUBG, BGMI, Free Fire, MLBB, COD లకు సపోర్ట్ చేస్తుంది మరియు HOK గేమ్ కు 120FPS సపోర్ట్ తో అందిస్తుంది.
రియల్ మీ 13 ప్లస్ 5జి ఫోన్ మీడియాటెక్ యొక్క లేటెస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 7300 Energy తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ 4nm TSMC ప్రోసెసర్ తో ఉంటుంది మరియు గేమింగ్ తో పాటు కెమెరా ప్రత్యేకమైనది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను అత్యంత వేగంగా చల్లబరిచే స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టం తో కూడా అందించింది.
Also Read: భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న ZEBRONICS పవర్ ఫుల్ Soundbar.!
కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 మెయిన్ + 2MP మోనో కెమెరాతో రియర్ కెమెరా సెటప్ కలిగి వుంది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ మరియు 2X లాస్ లెస్ జూమ్ తో వస్తుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది మరియు realme UI 5.0 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 14 OS తో రన్ అవుతుంది. ఈ ఫోన్ లో 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.