Realme 13+ 5G: టాప్ 5 ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!
రేపు ఇండియాలో రియల్ మీ 13 సిరీస్ నుంచి కొత్త ఫోన్లు లాంచ్ చేస్తోంది
ఈ సిరీస్ నుంచి విడుదల కాబోతున్న రియల్ మీ 13 ప్లస్ స్మార్ట్ ఫోన్
Realme 13+ 5G టాప్ 5 ఫీచర్లు విడుదల కంటే ముందే బయటపెట్టిన కంపెనీ
Realme 13+ 5G: రేపు ఇండియాలో రియల్ మీ 13 సిరీస్ నుంచి కొత్త ఫోన్లు లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ నుంచి విడుదల కాబోతున్న రియల్ మీ 13 ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క టాప్ 5 ఫీచర్లు విడుదల కంటే ముందే బయటపెట్టింది. ఈ ఫోన్ ను వేగవంతమైన ప్రోసెసర్ మరియు ఛార్జ్ టెక్ తో తీసుకు వస్తోందిట. రేపు విడుదల కాబోతున్న ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్లు ఈరోజు తెలుసుకోండి.
Realme 13+ 5G : లాంచ్
రియల్ మీ 13 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ 13 సిరీస్ నుంచి లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ఆగస్టు 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే 5 గొప్ప ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
Realme 13+ 5G Top 5 ఫీచర్స్
డిజైన్
రియల్ మీ 13 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను స్పీడ్ వేవ్ టెక్స్చర్ మరియు స్లీక్ డిజైన్ తో తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన డ్యూయల్ టోన్ కలర్ తో డిజైన్ చేయబడింది.
స్క్రీన్
ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 90FPS గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందించే AI ఐ కంఫర్ట్ OLED స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది.
ప్రోసెసర్
రియల్ మీ ఈ ఫోన్ ను వేగవంతమైన మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 7300 Energy తో అందిస్తోంది. ఇది 750K AnTuTu స్కోర్ అందిస్తుంది మరియు గేమింగ్ కు అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
Also Read: Youtube Price Hike: యూట్యూబ్ ప్రీమియం ధర పెంచిన గూగుల్.!
ర్యామ్ మరియు స్టోరేజ్
ఈ ఫోన్ ను అదనపు ర్యామ్ ఫీచర్ తో కలిపి 26GB ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ టీజర్ పేజి లో వెల్లడించింది.
బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్
రియల్ మీ 13 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ సపోర్ట్ తో లాంచ్ చేస్తుంది.
ఈ 5 ముఖ్యమైన ఫీచర్స్ ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ఆప్షన్ గా మార్చేలా కనిపిస్తున్నాయి.