రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme 12X 5G లాంఛ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ లాంఛ్ కంటే ముందే ఈ ఫోన్ టాప్-5 ఫీచర్స్ మరియు ప్రైస్ డీటెయిల్స్ వివరాలు లీకయ్యాయి. ఈ ఫోన్ ను 12 బడ్జెట్ కేటగిరిలో గొప్ప ఫీచర్స్ తో తీసుకు వస్తునట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ రియల్ మి అప్ కమింగ్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ వివరాల పైన ఒక లుక్కేయండి.
రియల్ మి ఈ ఫోన్ ను 2April 2024 తేదీకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను రియల్ మి 11X 5జి నెక్స్ట్ జెనెరేషన్ స్మార్ట్ ఫోన్ గా తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన కంప్లీట్ అప్గ్రేడ్ వివరాలను కూడా రియల్ మి ముందే వెల్లడించింది.
రియల్ మి 12X 5G స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే వివరాలను కంపెనీ ముందే వెల్లడించింది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.72 ఇంచ్ FHD డిస్ప్లే ఉన్నట్లు తెలిపింది. ఈ స్క్రీన్ 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది.
ఈ రియల్ మి అప్ కమింగ్ ఫోన్ మంచి కలిగి వుంది. ఇది కేవలం 7.9mm మందం కలిగి చాలా నాజూకుగా మరియు ట్రెండీ వాచ్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ రెండు అందమైన కలర్ ఆప్షన్ లలో కూడా వస్తుంది.
ఈ ఫోన్ ను MediaTek Dimesity 6100+ ప్రోసెసర్ శక్తితో తీసుకు వస్తునట్లు రియల్ మి కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ Android 14 OS తో నడుస్తుంది.
Also Read: ఉచిత Gas Connection కోసం అప్లై చెయ్యాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
రియల్ మి 12X 5జి ఫోన్ లో వెనుక క్వాడ్ కెమేరా సెటప్ మాదిరిగా కనిపించే సెటప్ వుంది. కానీ ఇందులో 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మాత్రమే ఉంటుంది.
రియల్ మి 12X 5జి ఫోన్ ను వేగవంతమైన 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh పెద్ద బ్యాటరీ సెటప్ తో తీసుకు వస్తోంది. అలాగే, ఈ ఫోన్ లో Air Gestures మరియు IP54 రైన్ వాటర్ స్మార్ట్ టచ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నట్లు టీజింగ్ ద్వారా బయట పెట్టింది.
ఈ ఫోన్ ను 12 వేల సెగ్మెంట్ లో బెస్ట్ ఫీచర్స్ తో వచ్చే ఫోన్ గా కంపెనీ టీజర్ ద్వారా అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ కేవలం 12 వేల రూపాయల కంటే తక్కువ ధరలో వస్తుందని కంపెనీ చెప్పకుండానే చెప్పింది. అయితే, ఈ ఫోన్ రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో లాంఛ్ అయ్యే అవకాశం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.