Realme 12 Pro Series: 120X జూమ్ కెమేరాతో కొత్త ఫోన్స్ లాంచ్ చేసిన రియల్ మి.!

Realme 12 Pro Series: 120X జూమ్ కెమేరాతో కొత్త ఫోన్స్ లాంచ్ చేసిన రియల్ మి.!
HIGHLIGHTS

Realme 12 Pro Series నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

రియల్ మి 12 ప్రో 5జి మరియు 12 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

ఈ సిరీస్ నుండి వచ్చిన రెండు ఫోన్లు కూడా గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి

ఈరోజు రియల్ మి ఇండియన్ మార్కెట్ లో Realme 12 Pro Series నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ 12 సిరీస్ నుండి రియల్ మి 12 ప్రో 5జి మరియు 12 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. కెమేరా ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ ఫోన్ లలో ప్రీమియం ఫోన్ ను 120X జూమ్ కెమేరాతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లను గొప్ప డిజైన్, ఫాస్ట్ ప్రోసెసర్ బెస్ట్ కెమేరా వంటి మరిన్ని ప్రత్యేకతలతో భారత్ లో లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. రియల్ మి కొత్త ఫోన్ల దా మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Realme 12 Pro Series Price

రియల్ మి 12 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 25,999 ధరతో లాంఛ్ చేసింది మరియు హై ఎండ్ వేరియంట్ 8GB + 256GB ను రూ. 26,999 ధరతో లాంచ్ చేసింది. ఇక ఈ సిరీస్ లో ప్రీమియం ఫోన్ 12 ప్రో+ 5జి ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 29,999 ధరతో, 8GB + 256GB వేరియంట్ ను రూ. 31,999 ధరతో మరియు 12GB + 256GB వేరియంట్ ను రూ. 33,999 ధరతో లాంచ్ చేసింది.

ఆఫర్స్

ఈ ఫోన్స్ పైన గొప్ప ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ రెండు ఫోన్స్ పైన రూ. 2,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ బెనిఫిట్స్ మరియు 12 నెలల వరకు No Cost EMI ఆఫర్ ను అందించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart, realme.com మరియు మీ దగరలోని స్టోర్స్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.

Also Read: Moto G54 5G: కొత్త ఫోన్ పైన భారీ తగ్గింపు..15 వేలకే 12GB ఫోన్ అందుకోండి.!

రియల్ మి 12 ప్రో సిరీస్ ప్రత్యేకతలు

ఈ సిరీస్ నుండి వచ్చిన రెండు ఫోన్లు కూడా గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఈ రెండు ఫోన్లను కూడా Sony మెయిన్ కెమేరాతో అందించింది. రియల్ మి 12 ప్రో మరియు 12 ప్రో+ రెండు ఫోన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ Curved Vision AMOLED డిస్ప్లే వుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది.

 Realme 12 Pro Series Specs

రియల్ మి 12 ప్రో+ ఫోన్ ను Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ కి జతగా 12GB RAM + 12GB డైనమిక్ RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకు వచ్చింది. అయితే, రియల్ మి 12 ప్రో ని మాత్రం Snapdragon 6 Gen 1 ప్రోసెసర్ జతగా 8GB + 8GB డైనమిక్ RAM మరియు 256GB ర్యామ్ స్టోరేజ్ తో లాంచ్ చేసింది.

12 ప్రో+ ఫోన్ లో వెనుక 50MP SonyIMX 890 (OIS) మెయిన్ కెమేరా + 64MP OIS పోర్ట్రెయిట్ పెరిస్కోప్ కెమేరా + 8MP వైడ్ యాగిల్ కెమేరాసెటప్ వుంది. ఈ ఫోన్ కెమేరా 40X డిజిటల్ జూమ్, 4K (at 30 fps) వీడియోలను షూట్ చెయ్యగలదు. ఈ ఫోన్ లో ముందు 32MP Sony IMX615 సెల్ఫీ కెమేరా కూడా వుంది.

Realme 12 Pro Series camera

ఇక 12 ప్రో ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP OIS Sony IMX882 మెయిన్ కెమేరా + 8MP వైడ్ యాంగిల్ + 32MP టెలిస్కోపిక్ కెమేరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా వుంది. ఇది 10X జూమ్ మరియు 4K (at 30 fps) వీడియోలను షూట్ చెయ్యగలదు.

ఈ రెండు ఫోన్లలో కూడా 5000 mAh బిగ్ బ్యాటరీని 67W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో కూడా Hi-Res Audio మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్స్ ను అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo