Realme 12+ 5G: రియల్ మి 12 సిరీస్ నుండి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్.!

Realme 12+ 5G: రియల్ మి 12 సిరీస్ నుండి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

12 సిరీస్ నుండి 12 ప్రో మరియు 12 ప్రో+ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన రియల్ మి

రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ప్రీమియం డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో తీసుకు రాబోతున్నట్లు రియల్ మి టీజింగ్

Realme 12+ 5G: ఇటీవల ఇండియాలో తన 12 సిరీస్ నుండి 12 ప్రో మరియు 12 ప్రో+ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన రియల్ మి మరో కొత్త ఫోన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మి 12 సిరీస్ నుండి తీసుకు వస్తున్న ఈ సార్ట్ ఫోన్ ఇమేజ్ లతో టీజింగ్ మొదలు పెట్టింది కంపెనీ. రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో తీసుకు రాబోతున్నట్లు రియల్ మి టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఈ రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పైన ఒక లుక్కేద్దామా.

Realme 12+ 5G Launch

రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ ను మార్చి 6వ తేది మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో లాంఛ్ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ఫోన్ కోసం Capture Clearer, Portrait Master అనే క్యాప్షన్ ను పెట్టింది. అంటే, ఈ ఫోన్ మంచి కెమేరా సెట్టింగ్ మరియు ఫీచర్స్ తో రాబోతున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ మరియు వీడియోల ద్వారా ఈ విషయం తేటతెల్లం కూడా చేసింది.

Also Read: MOTOROLA G04: అతి చవక 8GB RAM ఫోన్ మొదటి సేల్ రేపటి నుండి మొదలు.!

రియల్ మి 12+ 5జి టీజ్డ్ స్పెక్స్

రియల్ మి 12+ 5జి యొక్క డిజైన్ మరియు కెమేరా సెటప్ ను తెలియ చేసేలా టీజింగ్ ఇమేజ్ ను అందించింది. ఈ టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక లెథర్ డిజైన్ మరియు ప్రీమియం లుక్స్ ఉన్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ కెమేరా సెటప్ గురించి కంపెనీ చిన్న హింట్ ఇచ్చింది.

అదేమిటంటే, ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మొదటి ఫ్లాగ్ షిప్ లగ్జరీ వాచ్ డిజైన్ ఫోన్ అవుతుందని చెబుతోంది. అంటే, ఈ సిరీస్ నుండి ముందుగా వచ్చిన 12ప్రో మరియు 12 ప్రో + ఫోన్ల మాదిరిగా ప్రీమియం వాచ్ డయల్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

ఇక ఈ ఫోన్ టీజింగ్ ఇమేజ్ ను చూస్తుంటే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా సెటప్ ని ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ తో అందిస్తోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో OIS సపోర్ట్ ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ గ్రీన్ మరియు గోల్డ్ రెండు కలర్ లలో కనిపిస్తోంది. అలాగే, ఈ ఫోన్ చాలా సన్నని మరియు డిజైన్ ఆకర్షణీయమైన లుక్స్ తో వస్తున్నట్లు టీజర్ ఇమేజ్ ల ద్వారా అర్ధమవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo