Realme 12+ 5G ఈ Top-5 ఫీచర్స్ తో వచ్చింది.. రేటు ఎంతంటే.!
Realme 12+ 5G ను ఈరోజు రియల్ మి ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది
లగ్జరీ వాచ్ డిజైన్ మరియు Sony LYT-600 OIS కెమేరాతో వచ్చింది
టాప్ ఫీచర్స్ మరియు ఫోన్ ధర వివరాల పైన ఒక లుక్కేద్దామా
Realme 12+ 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మి ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను లగ్జరీ వాచ్ డిజైన్ మరియు Sony LYT-600 OIS కెమేరా వంటి మరిన్ని ఫీచర్లతో భారత్ లో విడుదల చేసింది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎన్నడూ లేని విధంగా ఆకట్టుకునే ఫీచర్స్ మరియు డిజైన్ ఈ ఫోన్ ను తీసుకు వచ్చినట్లు కంపెనీ ఈ ఫోన్ గురించి చెబుతోంది. మరి ఈ ఫోన్ ను కలిగిన ఉన్న ఆ టాప్ ఫీచర్స్ మరియు ఫోన్ ధర వివరాల పైన ఒక లుక్కేద్దామా.
Realme 12+ 5G: Price
రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 20,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ప్రైస్ ట్యాగ్ ను 8GB + 128GB వేరియంట్ కోసం అందించింది. అలాగే, రెండవ 8GB + 256GB వేరియంట్ ను రూ. 21,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందులోకి వచ్చింది.
Offers:
ఈ ఫోన్ పైన రియల్ మి ఆకర్షణీయమైన లాంఛ్ ఆఫర్లను కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ICICI, HDFC మరియు SBI Card బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన రూ. 1,000 అధనపు ఎక్స్ చేంజ్ తగ్గింపు ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 18,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చని కంపెనీ తెలిపింది.
Realme 12+ 5G: Top – 5 ఫీచర్స్
ప్రోసెసర్
రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 7050 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది. ఇది బడ్జెట్ ఎఫిషియంట్ ప్రోసెసర్ మరియు తగిన పెర్ఫార్మెన్స్ ను కూడా అందిస్తుందని రియల్ మి తెలిపింది.
Also Read: 50MP + 50MP మరియు 32MP కెమేరాలతో వచ్చిన Nothing Phone (2a) 5G వచ్చింది
RAM & Storage
ఈ రియల్ మి కొత్త ఫోన్ లో 8GB RAM + 8GB డైనమిక్ ర్యామ్ మరియు 256GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ర్యామ్ మరియు డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ ను మరింత వేగంగా ఉంచడానికి సహాయపడుతుంది.
డిస్ప్లే
రియల్ మి 12+ 5జి స్మార్ట్ ఫోన్ ని HDR 10+ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే సపోర్ట్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో తీసుకు వచ్చింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, రైన్ టచ్ సపోర్ట్ మరియు 93% స్క్రీన్ టూ బాడీ రేషియోని కలిగి ఉంటుంది.
కెమేరా
ఈ ఫోన్ లో మంచి కెమేరా సెటప్ మరియు కెమేరా డిజైన్ ను అందించినట్లు రియల్ మీ తెలిపింది. ఈ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక Sony LYT-600 OIS మెయిన్ సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్ సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ వుంది. అలాగే, ముందు 16MP AI సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ కెమేరాతో 4K (30fps) వీడియోలను షూట్ చేయగలదని తెలిపింది.
బ్యాటరీ & ఛార్జ్ టెక్
రియల్ మి 12+ 5జి ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.