Realme ఈరోజు తన అప్ అకమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Realme 11 Pro Series స్మార్ట్ ఫోన్స్ యొక్క కెమేరా టీజింగ్ ఇమేజ్ ను రివీల్ చేసింది. ఈ ఫోన్ లో అందించిన భారీ 200 MP OIS కెమేరా ఇమేజ్ తో ఇప్పుడు కంపెనీ టీజింగ్ ను మరింత పెంచింది. ఈ ఫోన్ యొక్క డిజైన్ ను వెల్లడించిన కంపెనీ ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ ను విడుదల చేయడం మొదలుపెట్టింది. అయితే, వాస్తవానికి రియల్ మి ప్రో 11 సిరీస్ చైనాలో ముందగానే రిలీజ్ కావడంతో వివరాలు అవే కావచ్చని అభిమానులు భావిస్తున్నారు.
ఈ Realme 11 Pro Series ను కంపెనీ ఇండియాలో జూన్ 8 న లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ లో ప్రో-లెవల్ 200MP సూపర్ జూమ్ కెమేరా OIS సపోర్ట్ తో ఉన్నట్లు కొత్త ఫీచర్ విడుదల చేసి టీజింగ్ స్పీడ్ పెంచింది. అంతేకాదు, సూపర్ OIS టెక్నలాజి కలిగిన మొదటి ఫోన్ ఇదే అవుతుందని కూడా కంపెనీ టీజింగ్ లో తెలిపింది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ వీడియో ను ఇక్కడ చూడవచ్చు.
https://twitter.com/realmeIndia/status/1664549655148113920?ref_src=twsrc%5Etfw
ఈ ఫోన్ యొక్క నెక్స్ట్ కీలక ఫీచర్ ని జూన్ 5 న వెల్లడిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్ బహుశా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించే కావచ్చు.
అయితే, చైనాలో విడుదలైన Realme 11 Pro Series లో రియల్ మి 11 ప్రో+ స్మార్ట్ ఫోన్ లో 200MP కెమేరా అవండి మరియు ఈ ఫోన్ భారీ ప్రత్యేకతలతో చైనా మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది.
ఇక ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా కొత్త ఒరవడిని తెచ్చినట్లు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ రియల్ మి ప్రీమియం లెథర్ మధ్యలో జిప్ మాదిరిగా కనిపించే స్ట్రిప్ తో ఆకట్టుకుంటోది.