ఇండియాలో విడుదలైన Realme 11 Pro Series 5G స్మార్ట్ ఫోన్స్.!

Updated on 08-Jun-2023
HIGHLIGHTS

రియల్ మి ఈరోజు ఇండియాలో తన కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది

Realme 11 Pro Series 5G ధర రూ. 23,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది

Curved Vision AMOLED డిస్ప్లేతో వచ్చిన రెండు ఫోన్లు

రియల్ మి ఈరోజు ఇండియాలో తన కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అదే, Realme 11 Pro Series 5G స్మార్ట్ ఫోన్స్ మరియు ఈ ఫోన్లను 200MP కెమేరా మరియు Curved డిస్ప్లే వంటి ఫీచర్లతో  ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది.  Realme 11 Pro Series 5G  స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది మరియు వీటి ధర రూ. 23,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. 

Realme 11 Pro Series 5G  నుండి Realme 11 Pro 5G మరియు Realme 11 Pro+ 5G రెండు స్మార్ట్ ఫోన్లను రియల్ మి ఈరోజు విడుదల చేసింది. ఈ రెదను స్మార్ట్ ఫోన్ల ధరలను ఇక్కడ చూడవచ్చు. 

Realme 11 Pro 5G: ధర

Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ రూ. 23,999 ప్రారంభ ధరతో వచ్చింది మరియు ఇది 8GB + 128GB వేరియంట్ ధర. ఇందులో రెండవ వేరియంట్ (8GB + 256GB) ధర రూ. 24,999 రూపాయలు మరియు హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ధర రూ. 27,999 గా నిర్ణయించింది. 

ఈ ఫోన్ పైన మంచి ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ అర్లీ యాక్సెస్ సేల్ నుండి ICICI బ్యాంక్ కార్డ్స్ & EMI అప్షన్ తో 8GB వేరియంట్ ఫోన్ కొనే వారికి రూ. 1,000 మరియు 12GB ర్యామ్ వేరియంట్ పైన రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.                      

Realme 11 Pro+ 5G: ధర

Realme 11 Pro+ 5G ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 27,999 రూపాయలు మరియు హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ధర రూ. 29,999.  11 Pro+ 5G ఫోన్ ను అర్లీ యాక్సెస్ సేల్ నుండి ICICI బ్యాంక్ కార్డ్స్ & EMI మరియు HDFC  ICICI బ్యాంక్ కార్డ్స్ & EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

Realme 11 Pro Series 5G: స్పెక్స్

Realme 11 Pro Series 5G రెండు ఫోన్ లలో కూడా దాదాపుగా ఒకే విధమైన స్పెక్స్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ Curved Vision AMOLED డిస్ప్లేని  FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉన్నాయి. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ మరియు 2160Hz PWM డిమ్మింగ్ తో కలిగి వుంది. ఈ ఫోన్లు మీడియాటెక్ Dimensity 7050 SoC, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్స్, రియల్ మి UI 4.0  సాఫ్ట్ వేర్ తో Android 13 OS వంటి వివరాలతో ఉన్నాయి. 

కెమేరాల పరంగా, రెండు ఫోన్లు 5000 mAh బ్యాటరీతో ఉన్నా, ఛార్జ్ టెక్ లో మాత్రం అంతరాలు ఉన్నాయి. వీటిలో  Realme 11 Pro+ 5G ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటే, Realme 11 Pro 5G మాత్రం 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి వుంది. 

ఈ రెండు ఫోన్ల కెమేరా సెట్టింగ్ లో కూడా మార్పులు ఉన్నాయి. Realme 11 Pro+ 5G ఫోన్ OIS సపోర్ట్ కలిగిన భారీ 200 MP ట్రిపుల్ రియర్ కెమేరా తో వస్తే, Realme 11 Pro 5G ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 100MP ట్రిపుల్ రియర్ కెమేరా ని కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :