200MP కెమేరాతో వచ్చిన Realme 11 Pro+ 5G టాప్ 5 ఫీచర్లు తెలుసుకోండి.!
Realme 11 Pro+ 5G యొక్క టాప్-5 ఫీచర్లు
కర్వ్డ్ డిస్ప్లే మరియు 100W సూపర్ ఉక్ ఛార్జింగ్ వంటి 5 ప్రధాన ఫీచర్లతో లాంఛ్ అయ్యింది
Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో డ్యూయల్ Linear స్పీకర్లను ఈ ఫోన్ కలిగి వుంది
నిన్న ఇండియాలో విడుదలైన రియల్ మి కొత్త స్మార్ట్ ఫోన్ Realme 11 Pro+ 5G యొక్క టాప్-5 ఫీచర్ల పైన ఒకలుక్కేద్దామా. ఈ లేటెస్ట్ ఫోన్ 200MP OIS కెమేరా, కర్వ్డ్ డిస్ప్లే మరియు 100W సూపర్ ఉక్ ఛార్జింగ్ వంటి 5 ప్రధాన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ అయ్యింది. మరి Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ కలిగిన ఆ టాప్ 5 ఫీచర్లు ఏమిటో తెల్సుకుందాం పదండి.
1. డిజైన్ & డిస్ప్లే
రియల్ మి 11 ప్రో+ ప్రీమియం లెథర్ వేగాన్ తో గొప్ప ప్రీమియం డిజైన్ కలిగి ఉండడమే కాకుండా ఆస్ట్రల్ బ్లాక్,ఒయాసిస్ గ్రీన్ మరియు సన్ రైజ్ బీజ్ అనే మూడు అందమైన కలర్ అప్షన్ లలో లాంఛ్ అయ్యింది. ఈ రియల్ మి ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ Curved OLED డిస్ప్లేని HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది.
2. పెర్ఫార్మెన్స్
ఈ రియల్ మి ఫోన్ 2.6Ghz క్లాక్ స్పీడ్ కలిగిన మీడియాటెక్ Dimensity 7050 SoC తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వేగం మరింత పెంచేందుకు వీలుగా 12GB వరకూ Dynamic RAM సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో జత చేసింది.
3. కెమేరా
రియల్ మి 11 ప్రో+ వెనుక ట్రిపుల్ కెమేరా వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ తో 200MP (Samsung ISOCELL HP3) హెవీ మెయిన్ కెమేరా, 8MP అల్ట్రా వైడ్ కెమేరా మరియు 2MP మ్యాక్రో కెమేరా ఉన్నాయి. ఈ కెమేరా 200MP మోడ్, సినీ మోడ్, స్టెరీ మోడ్ వంటి అనేక కెమేరా ఫీచర్లతో ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియోలను 30fps వద్ద షూట్ చెయ్యగలదు. అలాగే, 1080p వీడియో లను 30fps / 60fps వద్ద షూట్ చెయ్యగలదు. రియల్ మి 11 ప్రో+ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమేరాని పోర్ట్రైట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లతో తో కలిగి వుంది.
4. బ్యాటరీ
రియల్ మి 11 ప్రో+ ఫోన్ 5000 mAh హెవీ బ్యాటరీని 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది మరియు బాక్స్ లో 100W అడాప్టర్ ను కూడా కలిగి వుంది.
5. OS & ఆడియో
రియల్ మి 11 ప్రో+ స్మార్ట్ ఫోన్ Android 13 OS పైన రియల్ మి UI 4.0 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో డ్యూయల్ Linear స్పీకర్లను ఈ ఫోన్ కలిగి వుంది.