ఈరోజే ఇండియాలో రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme 11 Pro 5G యొక్క టాప్ -6 ఫీచర్లను ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో Curved డిస్ప్లే, 100MP OIS కెమేరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి 5 ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రవేశపెట్టబడింది. అందుకే, Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఈ టాప్ 5 ఫీచర్లను వివరంగా చూడనున్నాము.
రియల్ మి 11 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెథర్ వేగాన్ డిజైన్ మరియు మూడు అందమైన కలర్ అప్షన్ లతో వచ్చింది. ఈ ఫోన్ లో కంపెనీ Curved AMOLED డిస్ప్లేని అందించింది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 2160Hz PWD Dimming మరియు HDR 10+ సపోర్ట్ లను కలిగి వుంది.
ఈ ఫోన్ ను రియల్ మి 2.6Ghz వరకూ క్లాక్ స్పీడ్ అందించ గల మీడియాటెక్ Dimensity 7050 చిప్ సెట్ తో అందించింది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB / 12GB ర్యామ్ మరియు 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను మరింత వేగంగా మార్చేందుకు వీలుగా Dynamic RAM ఫీచర్ ను కూడా అందించింది.
రియల్ మి 11 ప్రో ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది మరియు ఇందులో OIS సపోర్ట్ కలిగిన 100MP మెయిన్ కెమేరా, 2MP సెన్సార్లు ఉన్నాయి. ఇందులో 100MP మోడ్, డ్యూయల్ వీడియో మరియు సినీ మోడ్ వంటి చాలా కెమేరా ఫీచర్లను కలిగి వుంది. ఇది 4K వీడియో లను 30fps వద్ద మరియు 1080P వీడియో లను 30fps మరియు 60fps వద్ద చిత్రీకరించ గల కెపాసిటి కలిగి వుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమేరా f/2.45 అపర్చర్ తో కలిగి వుంది.
ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ కెహెర్జింగ్ సపోర్ట్ తో అందించింది.
రియల్ మి 11 ప్రో ఫోన్ realme UI 4.0 సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ Linear డ్యూయల్ స్పీకర్లను Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కలిగి వుంది.