రియల్ మి రేపు ఇండియాలో Realme 11 5G Series నుండి రెండు కొత్త ఫోన్ లను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ నుండి Realme 11 5G మరియు Realme 11X 5G రెండు స్మార్ట్ ఫోన్ లను మరియు వీటితో పాటుగా Realme Buds Air 5 మరియు Buds Air 5 Pro ఇయర్ బడ్స్ లను కూడా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మి ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మరియు ఇయర్ బడ్స్ ను లేటెస్ట్ ఫీచర్లతో తీసుకు వస్తున్నట్లు రియల్ మి తెలిపింది మరియు టీజర్ ద్వారా కొన్ని కీలకమైన ఫీచర్లను కూడా అనౌన్స్ చేసింది. రియల్ మి రేపు విడుదల చేయనున్న Realme 11X Series టాప్ ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో అందించిన కెమేరా, డిజైన్ మరియు ఛార్జ్ టెక్ వివరాలను కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. కంపెనీ టీజర్ పేజ్ ప్రకారం, ఈ ఫోన్ గ్లోరీ హెలో డిజైన్ తో సన్నగా మరియు షైనీగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద బంప్ తో కెమేరా సెటప్ అందించింది మరియు ఇందులో 3X జూమ్ సపోర్ట్ కలిగిన 108MP మెయిన్ కెమేరా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లో 67W SUPERVOOC ఛార్జ్ టెక్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఛార్జ్ టెక్ ద్వారా కేవలం 17 నిముషాల్లోనే ఫోన్ 50% ఛార్జ్ అవుందని రియల్ మి టీజింగ్ ద్వారా తెలిపింది.
ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుందనగా, ఈరోజు ఉదయమే Realme 11 5G భారతీయ వేరియంట్ యొక్క అన్ బాక్సింగ్ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ అయ్యింది. ప్రముఖ లీక్ స్టర్ సుధాన్షు అంబోర్ ఈ వీడియో ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు.
https://twitter.com/Sudhanshu1414/status/1693822483470979265?ref_src=twsrc%5Etfw
ఈ వీడియోలో ఈ Realme 11 5G అన్ బాక్స్ చేసి గ్లిమ్స్ చూపించారు. ఈ ఫోన్ చాలా షైనీగా మరియు స్సన్నగా కనిపిస్తోంది ఈ వీడియోలో.