ఇండియాలో రెండు కొత్త ఫోన్ల లాంచ్ గురించి Realme డేట్ అనౌన్స్ చేసింది. Realme 11 సిరీస్ నుండి Relme 11 5G మరియు 11x 5G స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు రియల్ మి అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్లను కూడా ఆగష్టు 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నట్లు రియల్ మి ప్రకటించింది. ఈ లాంచ్ అనౌన్స్ మెంట్ తో పాటుగా ఈ ఫోన్ల కీలకమైన వివరాలతో టీజింగ్ ను కూడా కంపెనీ మొదలుపెట్టింది.
రియల్ 11 5G సిరీస్ స్మార్ట్ ఫోన్ల కోసం Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. ఈ మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ ఫోన్ల లంచ్ గురించి టీజింగ్ చేస్తోంది.
Realme 11 5G స్మార్ట్ ఫోన్ యొక్క కెమేరా సెటప్, డిజైన్ మరియు బ్యాటరీ వివరాలను టీజర్ ద్వారా కంపెనీ బయటపెట్టింది. దీని ప్రకారం, రియల్ మి 11 5G స్మార్ట్ ఫోన్ 108MP మెయిన్ కెమేరాతో వస్తోంది. ఈ ఫోన్ యొక్క కెమేరా లో అందించిన ఫిల్టర్స్ నైట్ మోడ్ మరియు కెమేరా పవర్ ను తెలియ చేసే చిత్రాలను కూడా కంపెనీ టీజర్ పేజ్ లో అందించింది. అంతేకాదు, ఈ 108MP కెమేరా 3X సపోర్ట్ ని కూడా కలిగి ఉందని కంపెనీ తెలిపింది.
ఈ అప్ కమింగ్ రియల్ మి స్మార్ట్ ఫోన్ సొగసైన గ్లోరీ హలో డిజైన్ మరియు రెండు ఆకర్షణీయమైన కలర్ లలో కనిపిస్తోంది. ఈ realme స్మార్ట్ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన హెవీ 5000 mAh బ్యాటరీతో లాంచ్ అవనునట్లు కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ లో అందించిన ఛార్జ్ టెక్ తో కేవలం 17 నిముషాల్లోనే ఫోన్ 50% వరకూ ఛార్జ్ అవుందని కూడా టీజింగ్ ద్వారా తెలిపింది.
ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన వివరాలను రియల్ వెల్లడించే అవకాశం ఉండవచ్చు.