Realme 10 Series: నవంబర్ 9 న లాంచ్ డేట్ ఫిక్స్.. ముందే లీకైన రియల్ మీ 10 స్పెక్స్.!

Realme 10 Series: నవంబర్ 9 న లాంచ్ డేట్ ఫిక్స్.. ముందే లీకైన రియల్ మీ 10 స్పెక్స్.!
HIGHLIGHTS

Realme 10 Series లాంచ్ డేట్ ను కంపెనీ ప్రకటించింది

రియల్ మీ 10 సిరీస్ నుండి 4G మరియు 5G ఫోన్లను కంపెనీ విడుదల చేయవచ్చని తెలుస్తోంది

రియల్ మీ ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను వెల్లడించింది

రియల్ మీ చాలా కాలంగా టీజ్ చేస్తూ వస్తున్న Realme 10 Series లాంచ్ డేట్ ను కంపెనీ ప్రకటించింది. రియల్ మీ 10 సిరీస్ నుండి 4G మరియు 5G ఫోన్లను కంపెనీ విడుదల చేయవచ్చని తెలుస్తోంది. విడుదల కంటే ముందుగానే Realme 10 4G యొక్క ఇమేజీలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి మరియు ఈ ఇమేజీలు ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి ముఖ్యముగా వివరాలను వెల్లడిస్తున్నాయి. అయితే, రీసెంట్ గా, రియల్ మీ ట్విట్టర్ ద్వారా ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను వెల్లడించింది. మరి ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ ఎటువంటి ప్రత్యేకతలతో వస్తోందో చూద్దామా.     

Realme 10 4G: స్పెక్స్ (Expected)

ఆన్లైన్లో లీకైన Realme 10 4G యొక్క ఇమేజస్ ను పూర్తిగా నమ్మినట్లయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ 6.5 ఇంచ్ Super AMOLED డిస్ప్లే ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మద్దతును కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio 99 SoC శక్తితో వస్తుందని రియల్ మీ  ఇప్పటికే ధృవీకరించింది. దీనికి జతగా మూడు స్టోరేజ్ అప్షన్ లతో ఫోన్ అందించబడుతుంది. ఇందులో 4GB బేసిక్ ర్యామ్వేరియంట్  వేరియంట్ మోదలుకొని 8GB ర్యా వేరియంట్ కూడా ఉంటాయి. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా, 128GB నుండి 256GB వరకూ ఉండవచ్చు.

బ్యాటరీ మరియు ఛార్జింగ్ పరంగా, రియల్ మీ 10 4G స్మార్ట్ ఫోన్ లో కూడా గతంలో వచ్చిన Realme ఫోన్లలో చూసినట్లుగా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు కలిగిన  5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. అలాగే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు AI ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుంది.ఈ ఫోన్‌లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని కూడా ధృవీకరించబడింది. లీకైన చిత్రం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంటుందని మరియు దానితో పాటు 2MP మాక్రో సెన్సార్ ఉండవచ్చని చూపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo