Realme 10 Pro+5G: ఈరోజు Flipkart నుండి మరొకసారి సేల్ కి అందుబాటులో.!

Updated on 19-Dec-2022
HIGHLIGHTS

Realme 10 Pro+ ఈరోజు మరొకసారి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Realme 10 Pro+5G Curved స్క్రీన్ తో వస్తుంది.

108MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ప్రత్యేకతలను కలిగివుంది

Realme ఇండియాలో లేటెస్ట్ విడుదల  చేసిన స్మార్ట్ ఫోన్ Realme 10 Pro+ ఈరోజు మరొకసారి సేల్ కి అందుబాటులోకి  వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ సేల్ జరగనున్నది. ఈ ఫోన్ ప్రీమియం ఫోన్లను తలపించే Cured డిస్ప్లేతో పాటుగా  108MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ప్రత్యేకతలను కలిగివుంది. ఈ ఫోన్ యొక్క స్పెక్స్, ధర మరియు ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.

Realme 10 Pro+5G: ధర

Realme 9 5G యొక్క బేసిక్ వేరియంట్ (6GB+128GB) రూ.24,999 ధరతో లాంచ్ కాగా, (8GB+128GB) వేరియంట్ రూ.25,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (8GB+256GB) రూ.27,999 ధరతో లాంచ్ చెయ్యబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్ Realme అధికారిక వెబ్సైట్ realme.com మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.   

Realme 10 Pro+5G: స్పెక్స్

Realme 10 Pro+5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల FHD+ రిజల్యూషన్ Curved స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది మరియు ఇది పంచ్-హోల్‌ డిజైన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 2160Hz డిమ్మింగ్, 100% DCI-P3 కలర్ గాముట్ మరియు 0.65mm డబుల్-రీఐన్ఫోర్స్డ్ గ్లాస్ సేఫ్టీతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ ఫాస్ట్ ప్రాసెసర్ డైమెన్సిటీ 1080 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ మరియు 2MP (4cm) మాక్రో సెన్సార్  ఉన్నాయి. ఈ కెమెరాతో 30FPS తో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. ఈ 8GB వరకు డైనమిక్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, Hi-Res ఆడియో, సూపర్ లైనర్ డ్యూయల్ స్పీకర్లు, మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :