Realme 10 4G: విడుదలకు ముందే లీకైన ఫోన్ లైవ్ ఇమేజీలు.!

Updated on 01-Nov-2022
HIGHLIGHTS

Realme 10 సిరీస్ నుండి స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది

Realme 10 4G స్మార్ట్ ఫోన్ కీలకమైన ఇమేజీలు లీక్ కావడం గమనార్హం

ఈ లీక్డ్ ఇమేజస్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను చూపిస్తున్నాయి

రియల్ మీ త్వరలోనే Realme 10 సిరీస్ నుండి స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, విడుదల కంటే ముందుగానే Realme 10 4G స్మార్ట్ ఫోన్ కీలకమైన ఇమేజీలు లీక్ కావడం గమనార్హం. ఈ లీక్డ్ ఇమేజస్ సింపుల్ గా ఫోన్ యొక్క డిజైన్ ను మాత్రమే చూపిస్తే అంతగా ఆశ్చర్యాన్ని కలిగించక పోవచ్చు. కానీ, ఈ లీక్డ్ ఇమేజస్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను చూపిస్తున్నాయి. క్లియర్ గా చెప్పాలంటే దాదాపుగా ఈ కమింగ్ స్మార్ట్ ఫోన్ ముఖ్యమైన వివరాలను దాదాపుగా ఈ లీక్డ్ ఇమేజిలు వెల్లడిస్తున్నాయి.

Realme 10 4G: స్పెక్స్ (Expected)

ఆన్లైన్లో లీకైన Realme 10 4G యొక్క ఇమేజస్ ను పూర్తిగా నమ్మినట్లయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ 6.5 ఇంచ్ Super AMOLED డిస్ప్లే ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మద్దతును కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio 99 SoC శక్తితో వస్తుందని రియల్ మీ  ఇప్పటికే ధృవీకరించింది. దీనికి జతగా మూడు స్టోరేజ్ అప్షన్ లతో ఫోన్ అందించబడుతుంది. ఇందులో 4GB బేసిక్ ర్యామ్వేరియంట్  వేరియంట్ మోదలుకొని 8GB ర్యా వేరియంట్ కూడా ఉంటాయి. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా, 128GB నుండి 256GB వరకూ ఉండవచ్చు.

బ్యాటరీ మరియు ఛార్జింగ్ పరంగా, రియల్ మీ 10 4G స్మార్ట్ ఫోన్ లో కూడా గతంలో వచ్చిన Realme ఫోన్లలో చూసినట్లుగా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు కలిగిన  5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. అలాగే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు AI ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుంది.ఈ ఫోన్‌లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని కూడా ధృవీకరించబడింది. లీకైన చిత్రం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంటుందని మరియు దానితో పాటు 2MP మాక్రో సెన్సార్ ఉండవచ్చని చూపిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :