Xiaomi రెడ్మి 3S మొదటి సేల్స్ ఈ రోజు. మీరు దీని గురించి తెలుసుకోవలసిన విషయాలు

Xiaomi రెడ్మి 3S మొదటి సేల్స్ ఈ రోజు. మీరు దీని గురించి తెలుసుకోవలసిన విషయాలు

ఈ రోజు ఇండియాలో Xiaomi రెడ్మి 3S(6,999 రూ) స్మార్ట్ ఫోన్ సేల్స్ మొదలవుతాయి మధ్యాహ్నం 12 గం.లకు. ఇంతకముందు సేల్ అయిన మోడల్ రెడ్మి 3S prime (8,999 రూ).

ఎక్కడ సేల్స్ అవుతున్నాయి?
1. Flipkart – బయింగ్ లింక్
2. Mi.com – 
బయింగ్ లింక్

రెడ్మి 3S ఫోన్ కు ఇది మొదటి సేల్స్. అయితే దీనితో పాటు 3S prime( రివ్యూ ) కూడా రెండవ సెల్ అవనుంది. అయితే వీటిని కొనటానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాని మినిమమ్ 2 మినిట్స్ లోపు కొనకపోతే స్టాక్స్ అయిపోతాయి.

అసలు రెండింటికీ తేడాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ లో చూడగలరు.

అయితే నా ఒపీనియన్ లో  7 వేల రూ 3S మోడల్ కన్నా 9 వేల రూ 3S Prime మంచి చాయిస్. ఈ రోజుల్లో 3GB ర్యామ్ మినిమమ్, మరియు స్టోరేజ్ కూడా ఎక్కువ లభిస్తుంది. ఇది మీకూ తెలిసిన విషయమే.

వీటికి మించి 3S Prime లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న ఫోన్ కొని దానిని వాడని users కూడా ఉన్నారు.

ఉదాహరణకు నేనే! ఎదో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందని ఒక మోడల్ కు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నా చాలా రోజుల క్రితం. కాని నేను FP ను కొన్ని రోజుల తరువాత వాడటమే మానివేసాను అని గమించాను.

అయితే మీలో కొంతమంది దానిని వాడుతూ ఉండవచ్చు. కాని నేను చెప్పేది ఏంటంటే డైలీ use అయ్యే వాటికీ మాత్రమే అదనపు డబ్బులు పెట్టడం అనే స్మార్ట్ బయింగ్ మీకు మనీ సేవ్ చేస్తుంది.

అయితే 9 వేల మోడల్ 3S PRIME వెయ్యి రూ అదనంగా ఉన్న రెడ్మి నోట్ 3 2GB వేరియంట్ కన్నా బెటర్ ఫోనా?
జనరల్ గా నోట్ 3 లో ఉన్న ప్రొసెసర్ 3S సిరిస్ లోని ప్రొసెసర్ కన్నా ఫాస్ట్. సో ప్రోసెసింగ్ స్పీడ్ అండ్ గేమింగ్ కు నోట్ 3(2GB ర్యామ్ వేరియంట్) బెస్ట్. మల్టీ టాస్కింగ్ ఎక్కువుగా చేసే వారికీ 3S Prime( 3GB ర్యామ్ వేరియంట్) మంచి చాయిస్ అవుతుంది.

రెడ్మి 3S prime రివ్యూ – లింక్
రెడ్మి నోట్ 3 రివ్యూ – లింక్

ఈ క్రింద మీరు రెడ్మి నోట్ 3 యొక్క తెలుగు వీడియో రివ్యూ ను చూడగలరు..

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo