ఇండియాలో ఆపిల్ ప్రోడక్ట్ లను తయారు చేయనున్నారు
ఇది వరుకే Foxconn అనే మరో సంస్థ ఇదే విషయాన్ని వెల్లడించింది.
తైవాన్ లోని PC తయారు చేసే అతి పెద్ద తయారిదారి, Quanta Computer Inc, ఇండియాలో ఆపిల్ ప్రోడక్ట్లు తయారు చేయటానికి ముందుకు వస్తుంది. అయితే అధికారికంగా తమ ప్లేన్స్ గురించి అనౌన్స్ చేయలేదు ఇంకా.
Quanta మేనుఫేక్చరింగ్ కంపెని వైస్ చైర్మన్ C.C Leung Reuters సంస్థ తో ఇండియాలో మేనుఫేక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించేందుకు కావలిసిన డేటా మరియు అనాలిసిస్ ఫెక్టర్స్ ను పరిశీలిస్తున్నారని చెప్పటం జరిగింది. Quanta కంపెని చాలా PC లతో పాటు ఆపిల్ వాచ్ ను అసేమ్బల్ చేస్తుంది.
అయితే ఇదివరుకే ఆపిల్ ప్రోడక్ట్లను తయారు చేసే Faxconn కంపెని మహారాష్త్ర లో ఒక యూనిట్ ప్రారంభిస్తుంది అని వెల్లడించింది. ఒకటి కాదు ఏకంగా 10 నుండి 12 యునిట్స్ ను ఇండియాలో 2020 సంవత్సరానికి అల్లా ఏర్పాటు చేయనుంది Foxconn.
ఆపిల్ ప్రొడక్ట్స్ ను ఇండియాలో తయారు చేస్తే, ఎప్పుడూ హై ఎండ్ ప్రైస్ లో ఉండే ఆపిక్ ప్రొడక్ట్స్ ధరలు కచ్చితంగా తగ్గుతాయి. తగ్గిస్తేనే ఆపిల్ ఇండియాలో సామ్సంగ్ వంటి స్మార్ట్ ఫోన్ దిగ్గజాలతో పోటీ పడగలదు.