క్వాల్కమ్ డ్యూయల్-స్క్రీన్ కలిగిన విండోస్ 10 పరికరాల విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో తలమునకలైనట్లు తెలుస్తోంది

Updated on 01-Aug-2018
HIGHLIGHTS

ARM - శక్తితో పనిచేసే విండోస్ 10 డ్యూయల్-స్క్రీన్ ఫోన్ల రూపకల్పనలో ఉన్నట్లు క్వాల్కమ్ నేరుగా అంగీకరించ లేదు , కానీ వినియోగదారులు తమ చిప్ లతో ఈ విభాగంలోని ఆవిష్కరణను చూడవచ్చని సూచనప్రాయంగా అన్నది .

ఇప్పుడు డ్యూయల్-స్క్రీన్ స్మార్ట్ఫోన్ల గురించి అనేక నివేదికలు మరియు  పుకార్లు ఉన్నాయి, అవేమిటంటే ఇవి త్వరలో మార్కెట్లను తాకినట్లు భావిస్తున్నారు. శామ్సంగ్ యొక్క ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ నుండి మైక్రోసాఫ్ట్ యొక్క ప్రాజెక్ట్ ఆన్డ్రోమెడ వరకూ, అన్ని కలగలిపి డ్యూయల్-స్క్రీన్ ఉన్న పరికరాలు ఉనికిని లోకి రానున్నాయని ఇంటర్నెట్ లో పలు పుకార్లు  చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు, విండోస్ యొక్క తాజా నివేదికానుసారం  విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేసే డ్యూయల్-స్క్రీన్ పరికరాల్లో విద్యుత్ వినియోగం సమస్యను పరిష్కారానికి కంపెనీ పనిచేస్తుందని, క్వాల్కాం యొక్క సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్,అయినటువంటి  మిగ్యుయేల్ న్యూన్స్ ,వెల్లడించినట్లుగా  చెబుతోంది.

ఇప్పటి వరకు వచ్చిన నివేదికల నుండి చూసినట్లయితే , ఆన్డ్రోమెడ అనేది ఒక డ్యూయల్-డిస్ప్లే మరియు కీలు కలిగిన మైక్రోసాఫ్ట్ యొక్క రాబోయే పరికరం అని అంతటా పుకార్లు వస్తున్నాయి.ఇది గనుక విడుదలైతే విండోస్ 10 తో  పనిచేసే పరికరాల్లో మొట్టమొదటి దానిగా ఉంటుంది , కానీ అది స్మార్ట్ ఫోన్ ,టాబ్లెట్ లేదా ఓకే ల్యాప్ టాప్ కంప్యూటర్ అన్నదీ ఇంకా స్పష్టం కాలేదు . "మీరు చూసినట్లయితే స్నాప్ డ్రాగన్ 835/850 ప్లాట్ ఫార్మ్ ని ఇంటెల్ (X86) ప్రొసెసర్ తో సరిపోల్చి నట్లయితే, మేము డిజైన్ స్టాండ్ పాయింట్ లో సుమారు 30 రెట్లు చిన్నగా   ఉన్నాము . కాబట్టి , 30 శాతం చిన్నదిగా రూపాన్ని డిజైన్ చేయగలిగిన మేము అదే ఫామ్ ఫెక్టర్ తో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చాలా చేయగలమని మీరే అంచనా వేయవచ్చు . రాబోయే కాలంలో మీరు డ్యూయల్- స్క్రీన్ తో పాటుగా రూప కారకంలో (ఫార్మ్ ఫేక్టర్) లో ఎన్నో కొత్త ఆవిష్కరణలను చూడవచ్చని, ఎందుకంటే వాటిని మేము అందించగలమని "  నౌన్స్  ఇచ్చిన ఒక సస్టేట్మెంట్ లో చెప్పారు.

"ఫార్మ్ ఫాక్టర్ ద్వారా వినియీగదారు ఓకే మంచి అనుభవాన్నిపొందడమే ఒక గొప్ప మార్గం అని నా ఉదేశం . సహజంగానే ,ఇది జరగడానికి కొంత సమయం పడుతుంది. ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారో అనేదానిని బట్టే భిన్నమైన ఫార్మ్ ఫాక్టర్లను అందుబాటులోకి తెస్తారు, ఒక  ఫార్మ్ ఫాక్టర్ స్థానాన్ని మరొక కొత్త ఫార్మ్ ఫాక్టర్ భర్తీ చేయవచ్చు లేదా అదే సమయం లో భిన్నమైన రూపకారకాలు (ఫార్మ్ ఫాక్టర్) ఆస్థానాన్ని భర్తీ చేస్తాయని నేననుకోవడం లేదు ;అది  ఆ ఫార్మ్ ఫాక్టర్ యొక్క విలువను ఆధారం చేసుకొని ఉంటుంది . ఐ ఉద్దేశ్యం ప్రకారం మీరు ఒక అద్భుతమైన పరిణామం ", చూస్తారని నియన్స్ చెప్పారు. ఈ స్టేట్మెంట్ ద్వారా 

చాలా కంపెనీలు, పిసి లను మడత పెట్టగల డిస్ప్లేలతో తయారు చేయడం లక్ష్యం గా పనిచేస్తున్నాని సూచన ప్రాంయంగా తెలుస్తుంది. గత నెలలో అసూస్  ప్రొజెక్ట్  ప్రీకాగ్ లో అలంకార ప్రాయంగా ప్రదర్శించిన ,ఇంటెల్ మోవిడస్ విజన్ ప్రోసెసింగ్ యూనిట్ కూడిన 360-డిగ్రీలు కోణంతో మడత పెట్టగల ల్యాప్ టాప్  దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు .

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :