Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ రోజు గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను చాలా ముచ్చటైన డిజైన్, గొప్ప కెమెరా మరియు వేగవంతమైన ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
పోకో ఎక్స్7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ మారియు రూ. 2,000 రూపాయల ICICI ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ దగరలో అందుకునే అవకాశం పోకో అందించింది.
జనవరి 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
పోకో ఎక్స్7 ప్రో స్మార్ట్ ఫోన్ 6.73 ఇంచ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8400 Ultra చిప్ సెట్ తో అందించింది ఈ చిప్ సెట్ కి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
పోకో ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Sony LYT-600 మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 20MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 60fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లో Gemini మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Oppo Reno 13 Series స్మార్ట్ ఫోన్స్ ధర మరియు ఆఫర్లు తెలుసుకోండి.!
ఈ పోకో కొత్త ఫోన్ డ్యూయల్ స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్, IP66 + IP68 + IP69 సపోర్టెడ్ రేటింగ్ మరియు 3 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 6,550 mAh బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని 90W హైపర్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.