Poco X7 Pro 5G మిడ్ రేంజ్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Poco X7 Pro 5G మిడ్ రేంజ్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

Poco X7 Pro 5G ఈ రోజు గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

వేగవంతమైన ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్

ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ రోజు గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను చాలా ముచ్చటైన డిజైన్, గొప్ప కెమెరా మరియు వేగవంతమైన ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా. 

Poco X7 Pro 5G: ప్రైస్ 

పోకో ఎక్స్7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ మారియు రూ. 2,000 రూపాయల ICICI ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ దగరలో అందుకునే అవకాశం పోకో అందించింది. 

జనవరి 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Poco X7 Pro 5G: ఫీచర్స్

పోకో ఎక్స్7 ప్రో స్మార్ట్ ఫోన్ 6.73 ఇంచ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8400 Ultra చిప్ సెట్ తో అందించింది ఈ చిప్ సెట్ కి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Poco X7 Pro 5G

పోకో ఎక్స్ 7 ప్రో  స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Sony LYT-600 మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 20MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 60fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లో Gemini మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: Oppo Reno 13 Series స్మార్ట్ ఫోన్స్ ధర మరియు ఆఫర్లు తెలుసుకోండి.!

ఈ పోకో కొత్త ఫోన్ డ్యూయల్ స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్, IP66 + IP68 + IP69 సపోర్టెడ్ రేటింగ్ మరియు 3 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 6,550 mAh బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని 90W హైపర్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo