Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!

Updated on 31-Dec-2024
HIGHLIGHTS

Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క చిప్ సెట్ కూడా వెల్లడించింది

పోకో ఎక్స్ 7 ప్రో జనవరి 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడుతుంది

Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ, ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క చిప్ సెట్ కూడా వెల్లడించింది. పోకో ఎక్స్ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేయడం మొదలు పెట్టింది.

Poco X7 Pro 5G : లాంచ్

పోకో ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ జనవరి 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడుతుంది. ఈ ఫోన్ తో పాటు ఈ సిరీస్ నుంచి పోకో ఎక్స్ 7 స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తుంది. నిన్న వరకు కేవలం లాంచ్ డేట్ మాత్రమే అనౌన్స్ చేసిన పోకో ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్ లను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.

Poco X7 Pro 5G : ఫీచర్స్

ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ మీడియా టెక్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Dimensity 8400 Ultra తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. సూటిగా చెప్పాలంటే పోకో ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ఈ చిప్ సెట్ లాంచ్ అయ్యే మొదటి ఫోన్ అవుతుంది.

ఈ చిప్ సెట్ 17,04,330 AnTuTu ను రీచ్ అయినట్టు పోకో వెల్లడించింది. అంతేకాదు, ఈ చిప్ సెట్ గొప్ప వేగం మరియు ఇంటెలిజెన్స్ యొక్క సరైన మిశ్రమం అని కూడా తెలిపింది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో 50MP OIS డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అలాగే, ఈ ఫోన్ ఆకర్షణీయమైన బ్లాక్ & ఎల్లో కాంబినేషన్ లో చూడముచ్చటగా కనిపిస్తోంది.

Also Read: Happy New Year 2025: మీ ప్రియమైన వారికి షేర్ చేయదగిన బెస్ట్ విషెస్.!

ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ చాలా స్లిమ్ డిజైన్ మరియు లెధర్ బ్యాక్ డిజైన్ తో కనిస్తోంది. ఈ ఫోన్ లను గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియాలో కూడా లాంచ్ చేస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :