Poco X7 5G: పవర్ ఫుల్ డిస్ప్లే మరియు వాటర్ ప్రూఫ్ డిజైన్ తో వస్తోంది.!

Poco X7 5G: పవర్ ఫుల్ డిస్ప్లే మరియు వాటర్ ప్రూఫ్ డిజైన్ తో వస్తోంది.!
HIGHLIGHTS

Poco X7 5G స్మార్ట్ ఫోన్ జనవరి 9వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతోంది

పోకో ఈ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా అనౌన్స్ చేస్తోంది

పోకో ఎక్స్ 7 5జి స్మార్ట్ ఫోన్ యొక్క మూడు కీలకమైన ఫీచర్లు కంపెనీ బయటపెట్టింది

Poco X7 5G స్మార్ట్ ఫోన్ జనవరి 9వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతోంది. పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి కొత్త ఫోన్ లను ప్రకటించిన పోకో ఈ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా అనౌన్స్ చేస్తోంది. ఈ సిరీస్ నుంచి తీసుకు రాబోతున్న బేసిక్ వేరియెంట్ అయిన పోకో ఎక్స్ 7 5జి స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను ఇప్పుడు కంపెనీ బయటపెట్టింది.

ఏమిటా Poco X7 5G కీలకమైన ఫీచర్స్?

పోకో ఎక్స్ 7 5జి స్మార్ట్ ఫోన్ యొక్క మూడు కీలకమైన ఫీచర్లు కంపెనీ బయటపెట్టింది. ఇందులో డిస్ప్లే, కెమెరా మరియు డ్యూరబిలిటీ ఫీచర్స్ ఉన్నాయి. ముందుగా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ ను 1.5K రిజల్యూషన్ కలిగినటువంటి 3D AMOLED స్క్రీన్ తో తీసుకు వస్తోంది. డిస్ వెట్ టచ్ డిస్ప్లే 2.0 సపోర్ట్ తో కూడా వస్తుంది.

Poco X7 5G

ఎక్స్ 7 5జి ఫోన్ డిస్ప్లే గరిష్టంగా 3000 ని ట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ ను కలిగి 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పటిష్టమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ లో అందించిన డ్యూరాబిలిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను IP68+ IP68 మరియు IP69 రేటింగ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు పోకో తెలిపింది. ఇది డ్యూరాబిలిటీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంటుంది, అని పోకో చెబుతోంది.

Also Read: Tecno Pop 9 5G ఫోన్ 8GB వేరియంట్ కూడా లాంచ్ అవుతోంది: ధర ఎంతంటే.!

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్స్ పాక్ అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo