Poco X6 Series Launch: జనవరి 11 న వస్తున్న పోకో కొత్త ఫోన్లు.!
Poco X6 Series Launch అనౌన్స్ చేసిన పోకో
పోకో ఎక్స్6 సిరీస్ నుండి కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది
ఆకట్టుకునే స్పెక్స్ తో తీసుకురాబోతున్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది
Poco X6 Series Launch: కొత్త సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానున్న పోకో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది పోకో. జనవరి 11 న ఇండియన్ మార్కెట్ లో పోకో ఎక్స్6 సిరీస్ నుండి కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లను కొత్త ఫీచర్లు మరియు ఆకట్టుకునే స్పెక్స్ తో తీసుకురాబోతున్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న వివరాలు మరియు అంచనా వివరాలు ఏమిటో చూద్దామా.
Poco X6 Series Launch
పోకో ఎక్స్6 సిరీస్ నుండి పోకో ఎక్స్6 మరియు పోకో ఎక్స్6 ప్రో ఫోన్ లను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ను జనవరి 11వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా లంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ లాంచ్ కంపెనీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి అందించింది ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. ఇందులో, 64MP OIS మెయిన్ కెమేరా ఉన్నట్లు కన్ఫర్మ్ కూడా అయ్యింది.అయితే, చైనాలో రీసెంట్ గా విడుదలైన రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో పోకో ఎక్స్ సిరీస్ గా రీబ్రాండ్ చేసి లాంచ్ చేయబడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
Also Read : Itel A70: 256GB భారీ స్టోరేజ్ తో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న ఐటెల్.!
ఈ ఫోన్ లాంచ్ కోసం పోకో అందించిన టీజర్ స్పెక్స్ మరియు ఇమేజీలు కూడా యిదే నిజం కావచ్చని చెబుతన్నాయి. ఎందుకంటే, పోకో ఎక్స్6 సిరీస్ నుండి వస్తున్న ఫోన్ లలో మీడియాటెక్ Dimensity 8300 ultra ప్రోసెసర్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఇది ఎక్స్ ప్రో వెర్షన్ కావచ్చు అని అంచనా వేస్తున్నారు.
ఈ సిరీస్ నుండి వచ్చే పూ ఎక్స్6 గురించి కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోన్ చైనాలై విడుదలైన రెడ్ మి కె70 E రీబ్రాండ్ వెర్షన్ గా వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ప్రోసెసర్ తో లాంచ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లను అందించే అవకాశం కూడా ఉంటుంది.