Poco X6 Series: అప్ కమింగ్ ఫోన్స్ టీజర్ విడుదల చేసిన పోకో. పోకో యొక్క సక్సెస్ ఫుల్ సిరీస్ గా పేరొందిన X సిరీస్ నుండి ఈ కొత్త ఫోన లను తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ టీజర్ వీడియోను లాంచ్ చేసింది. సిరీస్ కోసం పోకో అందించిన టీజర్ వీడియోతో పాటుగా ఈ సిరీస్ ఫోన్ లలో అందించనున్న కీలకమైన స్పెక్స్ ను కూడా అందించింది. మరి పోకో ఎక్స్ సిరీస్ నుండి లాంచ్ చేయబోతున్న స్మార్ట్ ఫోన్ ల వివరాలేమిటో తెలుసుకుందామా.
ఇండియన్ మార్కెట్ లో పోకో ఎక్స్6 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ గురించి అందించిన టీజర్ లో ఈ సిరీస్ లో MediaTek Dimensity 8300 Ultra ఆక్టా కోర్ ప్రోసెసర్ ఉన్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ప్రోసెసర్ తో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుందని కంపెనీ టీజర్ లో తెలిపింది. కంపెనీ అందించిన ట్వీట్ ను ఇక్కడ చూడవచ్చు.
పోకో టీజర్ ద్వారా ఈ ఫోన్ ఫాస్ట్ ఫీచర్స్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ టీజర్ లో పోకో ఎక్స్ సిరీస్ ఫోన్ లను శక్తిని సూచించేలా పెద్ద హ్యామర్ ను చేతిలో పట్టుకున్న హార్దిక్ కనిపిస్తున్నాడు. అంటే, ఈ పెర్ఫార్మెన్స్ మరియు ఫీచర్స్ గురించి తెలిసేలా ఈ టీజర్ ను లాంచ్ చేసినట్లు చెబుతున్నారు.
అయితే, Redmi K70e స్మార్ట్ ఫోన్ ను రీబ్రాండ్ చేసి ఇండియాలో పోకో ఎక్స్ ప్రో గా లాంచ్ చేస్తున్నట్లు నివేధికలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ముందు నుండే చాలా నివేదికలు చెబుతూ వస్తున్నాయి. ఇదే నిజమైతే, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన పెద్ద డిస్ప్లేతో ఈ ఫోన్ వస్తుంది.
Also Read : తక్కువ ధరలో 50 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ డీల్ కోసం చూస్తున్నారా?
ఇందులో, 64MP ట్రిపుల్ రియర్ కెమేరా సిస్టమ్, 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500mAh బిగ్ బ్యాటరీ ఉంటాయి. ఇందులో Dolby Atmos సపోర్ట్ మరియు Hi-Res సర్టిఫైడ్ డ్యూయల్ స్పీకర్లు కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా నివేదికలు అందిస్తున్న అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు గా మీరు చూడవచ్చు.
అయితే, ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి త్వరలోనే ఈ సిరీస్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా అందించే అవకాశం వుంది.