పోకో సక్సెస్ ఫుల్ సిరీస్ గా పేరొందిన X సిరీస్ నుండి కొత్త ఫోన్ లను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్ 6 సిరీస్ ను జనవరి 11న ఇండియాలో లాంచ్ చేస్తునట్లు షియోమి ప్రకటించింది. ఈ సిరీస్ కోసం చేస్తున్న టీజింగ్ లో భాగంగా ఈ సిరీస్ నుండి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్ల కీలకమైన ఫీచర్లను బయట పెట్టింది. ఇండియాలో Xiaomi Hyper OS తో వచ్చే మొదటి ఫోన్ Poco X6 Pro అవుతుందని షియోమి టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్స్ ఇతర స్పెక్స్ ను కూడా టీజింగ్ ద్వారా బయట పెట్టింది.
పోకో ఎక్స్6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను భారీ స్పెక్స్ మరియు ఫీచర్లతో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ సిరీస్ ఫోన్ లతో ఇండియాలో MediaTek Dimensity 8300 Ultra ప్రోసెసర్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది. ఈ ప్రోసెసర్ 1.4M కంటే ఎక్కువ AnTuTu స్కోర్ ను కలిగి ఉన్నట్లు టీజర్ పేజ్ నుండి టీజింగ్ చేస్తోంది.
పోకో ఎక్స్6 సిరీస్ ను సెగ్మెంట్ ఫస్ట్ 1.5K రిజల్యూషన్ డిస్ప్లే ఫోన్ లుగా పరిచయం చేయబోతునట్లు కూడా తెలిపింది. ఇది 10+2 బిట్ AMOLED డిస్ప్లే మరియు 68 బిలియన్ కంటే ఎక్కువ కలర్ సపోర్ట్ తో వస్తుందని షియోమి టీజింగ్ చెబుతోంది. లెథర్ బ్యాక్ మరియు అద్భుతమైన డిజైన్ తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా అందమైన డిజైన్ తో లాంచ్ కాబోతునట్లు క్లియర్ గా చెబుతోంది.
Also Read : MOTOROLA G34 5G: చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది.!
ఈ సిరీస్ ఫోన్ లలో అందించనున్న కెమేరా సెటప్ ను కూడా కంపెనీ ముందుగానే వెల్లడించింది. ఈ సిరీస్ ఫోన్ లలో 64MP OIS మెయిన్ కెమేరా + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్ గల ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా 2X లాస్ లెస్ ఇన్ సెన్సార్ జూమ్ ఫీచర్ తో వస్తుందని కూడా తేజ్ చేస్తోంది.
ఈ సిరీస్ నుండి లాంచ్ చేయబోతున్న ప్రొకో ఎక్స్6 ప్రో స్మార్ట్ ఫోన్ షియోమి హైపర్ OS తో ఇండియన్ మార్కెట్ లో విడుదల అయ్యే మొదటి ఫోన్ అని షియోమి కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ Wild Boost 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్ తో వస్తుందని కూడా తెలిపింది.