POCO X6 Pro 5G: మిడ్ రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లతో లాంఛ్ అయ్యింది.!

POCO X6 Pro 5G: మిడ్ రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లతో లాంఛ్ అయ్యింది.!
HIGHLIGHTS

POCO X6 Pro 5G మిడ్ రేంజ్ ధరలో లాంఛ్ అయ్యింది

Dimensity 8300 Ultra ప్రోసెసర్ మరియు చూడచక్కని డిజైన్ తో వచ్చింది

పోకో ఈ స్మార్ట్ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా జతచేసింది

POCO X6 Pro 5G: మిడ్ రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లతో లాంఛ్ అయ్యింది. ప్రొకో ఎక్స్6 సిరీస్ నుండి రెండు ఫోన్ లను ఈరోజు పోకో లాంచ్ చేసింది. వీటిలో ఎక్స్6 ప్రో Dimensity 8300 Ultra ప్రోసెసర్ మరియు చూడచక్కని డిజైన్ తో లాంచ్ వచ్చింది. పోకో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

POCO X6 Pro 5G Price

పోకో ఎక్స్6 ప్రో 5జి బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ తో రూ. 26,999 ధరలో లాంచ్ అయ్యింది. ఇక రెండవ మరియు హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ ని కలిగి రూ. 28,999 ధరలో వచ్చింది.

పోకో ఈ స్మార్ట్ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా జతచేసింది. HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ ను అందజేస్తోంది. ప్రొకో ఎక్స్6 ప్రో 5జి యొక్క Pre Orders ఈ రోజు నుండి మొదలయ్యాయి.

Also Read : POCO X6 5G: తక్కువ ధరలో 1.5K Dolby Vision డిస్ప్లే వంటి భారీ ఫీచర్లతో వచ్చింది.!

పోకో ఎక్స్6 ప్రో 5జి స్పెక్స్ & ఫీచర్స్

పోకో ఎక్స్6 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ MediaTek లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 8300 Ultra ప్రోసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ప్రోసెసర్ కి జతగా 12GB LPDDR5X RAM మరియు 512 GB (UFS 4.0) లను కూడా జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను బ్లేజింగ్ ఫాస్ట్ గా మార్చాడనికి వీలుగా Wild Boost Gaming Optimisation 2.0 ని కూడా అందించింది.

POCO X6 pro 5G with Dimensity 8300 Ultra

ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 1.5K (2712 x 1220) రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని Dolby Vision సపోర్ట్ తో కలిగి వుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 68.7 బిలియన్స్ కలర్స్ అందించగలదని పోకో తెలిపింది. ఈ డిస్ప్లేలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వుంది మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ తో ఈ డిస్ప్లేని మరింత స్ట్రాంగ్ గా చేసింది.

ఈ పోకో ఎక్స్6 ప్రో 5జి లో వెనుక 64MP OIS + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్ తో ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరాతో 30 fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేసే వీలుంది. అలాగే, ఫ్రెంట్ లో 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ పోకో ఫోన్ IP54 రేటింగ్ తో వస్తుంది మరియు 5000mAh బ్యాటరీని 67W టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను వేగాన్ లెథర్ బ్యాక్ తోగొప్ప ఆకర్షణీయమైన డిజైన్ తో అందించింది.

ఈ ఫోన్ అవుట్ అఫ్ డి బాక్స్ Xiaomi HyperOS సాఫ్ట్ వేర్ తో Android 14 OS తో పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo