POCO X6 Neo 5G vs Nothing Phone (2a) 5G: కంప్లీట్ కంపేరిజన్.!
POCO X6 Neo 5G మరియు నథింగ్ ఫోన్ (2a) కంప్లీట్ కంపేరిజన్
ఇండియన్ మార్కెట్ లో విడుదల లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ POCO X6 Neo 5G vs POCO X6 Neo
ఈ రెండు ఫోన్ లలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి
POCO X6 Neo 5G vs POCO X6 Neo: ఇండియన్ మార్కెట్ లో విడుదల లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఐకూ ఎక్స్ 6 నియో మరియు నథింగ్ ఫోన్ (2a) కంప్లీట్ కంపేరిజన్ ఈరోజు చూడనున్నాము. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చాయి.
POCO X6 Neo 5G vs Nothing Phone (2a) 5G: Price
ఐకూ ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ రూ. 15,999 ప్రారంభ ధరతో మార్కెట్ లో విడుదలయ్యింది. అయితే, నథింగ్ ఫోన్ (2a) రూ. 23,999 ప్రారంభ ధరతో లాంఛ్ అయ్యింది. ధర పరంగా ఈ రెండు ఫోన్లలో చాలా వ్యతాసం వుంది. అయితే, ఫీచర్స్ మరియు స్పెక్స్ పరంగా కూడా ఈ రెండు ఫోన్ లలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.
Display
ఐకూ ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ 120Hz 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.7 ఇంచ్ Flexible AMOLED డిస్ప్లేని HDR 10+ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే సెన్సార్ తో కలిగి వుంది.
Processor
ఐకూ ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6080 తో పని చేస్తుంది. నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ మాత్రం మీడియాటెక్ మిడ్ రేంజ్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Dimensity 7200 Pro తో పని చేస్తుంది.
Also Read: సరసమైన Lava Curve 5G పైన ధమాకా ఆఫర్లు అందుకోండి.!
RAM & Storage
ఈ రెండు ఫోన్లు కూడా 8 GB RAM మరియు 128 GB స్టోరేజ్ నుండి ప్రారంభమవుతాయి. ఈ రెండు ఫోన్లు కూడా 12 GB RAM మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్ ను కూడా కలిగి ఉన్నాయి.
Camera
ఐకూ ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ 108MP + 2MP డ్యూయల్ కెమేరా సెటప్ తో వస్తుంది. అయితే, నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ కెమేరాని OIS & EIS సపోర్ట్ లతో కలిగి వుంది.
OS
ఐకూ ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ MIUI 14 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS పైన చేస్తుంది. కానీ, నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ మాత్రం Nothing OS 2.5 సాఫ్ట్ వేర్ పైన లేటెస్ట్ Android 14 OS తో పని చేస్తుంది.
Battery & Power
ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే, ఐకూ ఎక్స్ 6 నియో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సతో వస్తే, నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ మాత్రం 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి వుంది.